Subramanian Swamy : సుబ్రహ్మణ్య స్వామికి ఢిల్లీ హైకోర్టు షాక్
ఆరు వారాల్లో బంగ్లా ఖాళీ చేయాల్సిందే
Subramanian Swamy : భారతీయ జనతా పార్టీ మాజీ ఎంపీ, ప్రముఖ న్యాయవాది సుబ్రహ్మణ్య స్వామికి(Subramanian Swamy) కోలుకోలేని షాక్ తగిలింది. ఆరు వారాల లోగా ప్రభుత్వ బంగ్లా ఖాళీ చేయాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది.
దేశ రాజధానిలో ఆయన నివాసం ఉంటున్న అధికారిక నివాసాన్ని వదిలి వేయాలని పేర్కొంది. ప్రైవేట్ ఇంట్లో కూడా సెక్యూరిటీ ఉంటుందని స్పష్టం చేసింది.
ఇదిలా ఉండగా మాజీ ఎంపీకి ముప్పు ఉందనే కారణంగా 2016లో మోదీ(PM Modi) బీజేపీ ప్రభుత్వం ఢిల్లీలోని లుట్యెన్స్ బంగ్లా జోన్ లో ఒక ఇంటిని కేటాయించింది.
సుబ్రహ్మణ్య స్వామికి అంతే కాకుండా జెడ్ కేటగిరీ సెక్యూరిటీ కూడా ఏర్పాటు చేసింది కేంద్ర సర్కార్. గత ఏడాది 2021 ఏప్రిల్ నాటికి రాజ్యసభ పదవీ కాలం పూర్తయింది స్వామిది.
ఆనాటి నుంచి నేటి దాకా ప్రభుత్వ బంగ్లాలోనే సేద దీరుతున్నారు. పొద్దస్తమానం నీతి, నిజాయితీ, జాతీయత, బాధ్యతలు, అవినీతి, అక్రమాల గురించి ప్రశ్నించే మాజీ ఎంపీ, న్యాయవాది తన దాకా వచ్చాక ఎందుకు అలాగే ఉన్నారని విపక్షాలు ప్రశ్నించాయి.
గత ఏప్రిల్ నుంచి నేటి దాకా తన అధికారిక నివాసాన్ని ఖాళీ చేయకుండా అక్కడే ఉన్నారు. కాగా ఈ ఇంటిని తనకు తిరిగి కేటాయించాలని కోరుతూ కోర్టును ఆశ్రయించారు.
తన ప్రాణానికి ముప్పు ఉందని అందుకే సెక్యూరిటీ ఏర్పాటు చేశారని, ప్రైవేట్ ఇంట్లో ఉంటే బాగోదని తెలిపారు. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేశారు జస్టిస్ యశ్వంత్ వర్మ..
ఎక్కడైనా సెక్యూరిటీ ఉంటుందని , ఇక కబుర్లు ఆపేసి ఖాళీ చేయడంపై ఫోకస్ పెట్టాలని సూచించింది.
Also Read : హిజాబ్ కేసులో సుప్రీం కీలక కామెంట్స్