Delhi High Court : నేత‌ల కామెంట్స్ కోర్టు సీరియ‌స్

అధికారంలో ఉన్న వారు బాధ్య‌త‌తో ఉండాలి

Delhi High Court : దేశంలో రాజ‌కీయ నాయ‌కులు రోజుకో తీరున మాట్లాడుతున్నారు. వాళ్లు ప‌రిధులు దాటి కామెంట్స్ చేయ‌డం మంచి ప‌ద్ద‌తి కాదు. ప్ర‌త్యేకించి అధికారంలో ఉన్న వారు మ‌రింత బాధ్య‌తాయుతంగా ఉండాలి. కానీ అలా చేయ‌డం లేదు.

ఎవ‌రంత‌కు వాళ్లు ఇలా విద్వేష పూరితంగా మాట్లాడుతూ పోతే ఇక ప్ర‌జాస్వామ్యానికి ప్రమాదం ఏర్ప‌డుతుంద‌ని తీవ్ర వ్యాఖ్య‌లు చేసింది ఢిల్లీ హైకోర్టు(Delhi High Court).

త‌మ నోళ్ల‌ను కాస్తా పొదుపుగా, జాగ్ర‌త్త‌గా వాడాల‌ని సూచించింది. ముఖ్యంగా పొలిటిక‌ల్ లీడ‌ర్ల‌కు చుర‌క‌లు అంటించింది. పౌర‌స‌త్వ స‌వ‌ర‌ణ చ‌ట్టానికి వ్య‌తిరేకంగా 2020లో నిర‌స‌న‌లు చోటు చేసుకున్నాయి.

ఆ స‌మ‌యంలో ద్వేష పూరిత ప్ర‌సంగాలు చేశారంటూ భార‌తీయ జ‌న‌తా పార్టీకి చెందిన ఎంపీలు అనురాగ్ ఠాకూర్ , ప‌ర్వేశ్ క‌శ్య‌ప్ ల‌పై పోలీసు కేసును అనుమ‌తించాలంటూ సీపీఎం నాయ‌కురాలు బృందా కార‌త్ చేసిన విన్న‌పాన్ని కోర్టు తిర‌స్క‌రించింది.

కేంద్ర ప్ర‌భుత్వం నుంచి ఎలాంటి త‌ప్ప‌నిస‌రి ప‌ర్మిష‌న్ లేదంటూ గ‌గ‌త ఏడాది ఇదే విధ‌మైన అప్పీలును తిర‌స్క‌రించిన ట్ర‌య‌ల్ కోర్టు ఆదేశాల‌ను స‌మ‌ర్థించింది. అయితే రాజ‌కీయ నాయ‌కుల‌పై కామెంట్స్ పై సీరియ‌స్ అయ్యింది.

న్యాయ‌మూర్తి చంద్ర ధారి సింగ్ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. మ‌తం, కులం, ప్రాంతం లేదా జాతి ప్రాతిప‌దిక‌న ఎన్నికైన ప్ర‌జా ప్ర‌తినిధులు , రాజ‌కీయ‌, మ‌త పెద్ద‌లు ద్వే ష పూరిత ప్ర‌సంగాలు చేయ‌డం సోద‌ర భావానికి విరుద్ద‌మ‌ని పేర్కొన్నారు.

అలాంటి వాళ్లు రాజ్యాంగ ధ‌ర్మాన్ని బోల్డోజ్ చేస్తారంటూ వ్యాఖ్యానించారు. ఇలా మాట్లాడ‌టం అంటే రాజ్యాంగం ప్ర‌సాదించిన హ‌క్కుల్ని కాల రాయ‌డం త‌ప్ప మ‌రొక‌టి కాద‌ని అభిప్రాయ‌ప‌డ్డారు.

Also Read : డ్ర‌గ్స్ కేసులో సిద్దాంత్ కు బెయిల్

Leave A Reply

Your Email Id will not be published!