Delhi Polution : ప్రపంచంలోని 100 అత్యంత కాలుష్య కారక ప్రదేశాలలో ఏకంగా 63 భారతీయ నగరాలు ఉన్నాయి. ఇది అత్యంత ప్రమాదకరమైన అంశంగా పరిగణించక తప్పదు.
గత ఏడాదితో పోలిస్తే ఈసారి 15 శాతం కాలుష్య తీవ్రత పెరిగడం విశేషం. ఢిల్లీ వరుసగా రెండో ఏడాది ప్రపంచంలోనే అత్యంత కాలుష్య రాజధాని గా ఉందని ఐక్యూఏఐఆర్ సంస్థ వెల్లడించింది.
అత్యధికంగా నగరాలు మన ఇండియాకు చెందినవే ఉండడం బాధాకరం. 2021లో భారత వాయు కాలుష్యం మరింత దారుణంగా మారిందని స్విట్జర్లాండ్ కుచెందిన ఈ సంస్థ విడుదల చేసిన వాయు నాణ్యత నివేదిక వెల్లడించింది.
ప్రాణాంతకమైన , మైక్రో స్కోపిక్ పీఎం2.5 కాలుష్య కారకంలో కొలిచిన సగటు వాయు కాలుష్యం, క్యూబిక్ మీటర్ కు 58.1 మైక్రోగ్రాములుగా ఉంది. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ , నాణ్యతా మార్గదర్శకాల కంటే 10 రెట్లు ఎక్కువ.
ఇక భారత దేశంలోని ఏ నగరమూ డబ్ల్యూహెచ్ఓ ప్రమాణాలను అందుకోలేక పోవడం గమనార్హం. ఉత్తర భారత దేశం కాలుష్యంలో అధ్వాన్నంగా ఉంది.
గత ఏడాది కంటే దాదాపు 15 శాతానికి పైగా కాలుష్యం పెరిగి పోయిందని సంస్థ వెల్లడించింది. ఢిల్లీ వాయు కాలుష్యం(Delhi Polution) ప్రపంచ వ్యాప్తంగా 4వ స్థానంలో ఉండగా ఆ తర్వాతి స్థానాల్లో భివాండీ, ఘజియాబాద్ ఉంది.
మొదటి 15 నగరాలలో 10 ఇండియాకు చెందిన సిటీస్ ఉన్నాయి. ఇప్పటికే సుప్రీంకోర్టు పలుమార్లు హెచ్చరికలు జారీ చేసింది. కాలుష్యం కారణంగా మనుషుల జీవన ప్రమాణాలు ఒక దశాబ్దం వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని నివేదిక హెచ్చరించింది.
Also Read : పంజాబ్ ను మోసం చేసిన ఆప్