Delhi LG Removed : ఆప్ కు షాక్ నామినీలు తొలగింపు
ఎల్జీ వినయ్ కుమార్ సక్సేనా
Delhi LG Removed : ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి కోలుకోలేని షాక్ ఇచ్చారు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వినయ్ కుమార్ సక్సేనా. ఇప్పటికే ఎల్జీ వర్సెస్ సీఎంకు మధ్య పొసగడం లేదు. ఎప్పుడైతే ఎల్జీగా కొలువు తీరారో ఆనాటి నుంచి నేటి దాకా యుద్దం నడుస్తోంది. దేశ వ్యాప్తంగా సంచలనం రేపిన ఢిల్లీ లిక్కర్ స్కాంపై విచారణకు మొదట ఆదేశించారు ఎల్జీ సక్సేనా.
దీనిపై పెద్ద రాద్ధాంతమే చోటు చేసుకుంది. ఈ మొత్తం వ్యవహారంలో ఇప్పటి వరకు 9 మందని అరెస్ట్ చేసింది ఈడీ. ఇందులో ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి కొడుకు, సీఎం కేజ్రీవాల్, ఎమ్మెల్సీ కవిత ను కూడా చేర్చింది. తాజాగా కోలుకోలేని రీతిలో షాక్ ఇచ్చారు ఎల్జీ సక్సేనా. ప్రైవేట్ డిస్కమ్ లపై పార్టీ ఎంపిక చేసిన ప్రతినిధులను తొలగిస్తున్నట్లు లెఫ్టినెంట్ గవర్నర్(Delhi LG Removed) స్పష్టం చేశారు. ఈ మేరకు ఎల్జీ కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది.
రాజ్యాంగ విరుద్దం, చట్ట విరుద్దమని పేర్కొంది. విద్యుత్ పై ఉత్తర్వులు జారీ చేసే అధికారం ఎన్నికైన ప్రభుత్వానికి మాత్రమే ఉందని తెలిపింది. ఆప్ నామినీల స్థానంలో సీనియర్ ప్రభుత్వ అధికారులు ఉన్నారు.
శనివారం ఈ మేరకు ప్రైవేట్ విద్యుత్ పంపిణీ సంస్థల బోర్డు నుంచి ఇద్దరు నామినీలను తొలగించారు. ఆప్ అధికార ప్రతినిధి జాస్మిన్ షా , ఆప్ ఎంపీ ఎన్డీ గుప్తా కుమారుడు నవీన్ ఎన్డీ గుప్తాను పక్కన పెడుతున్నట్లు స్పష్టం చేశారు. వారు చట్ట విరుద్దంగా నామినీలుగా నియమించబడినట్లు పేర్కొన్నారు.
Also Read : వాస్తవాల పరిశీలనపై ప్రజాభిప్రాయం