Delhi LG Atishi : ప‌వ‌ర్ స‌బ్సిడీ ఫైల్ క్లియ‌ర్ – ఎల్జీ

ఆప్ విద్యుత్ శాఖ మంత్రివ‌న్నీ అబ‌ద్దాలే

Delhi LG Atishi : ఢిల్లీలో ఆప్ , లెఫ్టినెంట్ గ‌వ‌ర్నర్ విన‌య్ కుమార్ స‌క్సేనా మ‌ధ్య మ‌రోసారి వివాదం రాజుకుంది. ప్ర‌తి ఏటా స‌ర్కార్ 46 ల‌క్ష‌ల మంది విద్యుత్ వినియోగ‌దారుల‌కు స‌బ్సిడీ ఇస్తోంది. దీనికి సంబంధించి ఫైల్ ను పంపించినా ఇంత వ‌ర‌కు సంత‌కం చేయ‌లేదంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు విద్యుత్ శాఖ మంత్రి అతిషి(Delhi LG Atishi). దీనిపై ఎల్జీ కార్యాల‌యం వెంట‌నే స్పందించింది. మంత్రి చేసిన ఆరోప‌ణ‌లు స‌త్య దూర‌మ‌ని పేర్కొంది. 200 యూనిట్ల లోపు ఉన్న వినియోగ‌దారుల‌కు స‌బ్సిడీ అందుతుంది.

ఇందు కోసం ఆప్ ఈసారి 2023-24 బ‌డ్జెట్ లో విద్యుత్ స‌బ్సిడీకి సంబంధించి రూ. 3,250 కోట్లు కేటాయించింది. ఇందులో భాగంగా ఫైల్ కూడా క్లియ‌రెన్స్ కోసం ఎల్జీ ప‌రిశీల‌న నిమిత్తం పంపింది. శుక్ర‌వారం నుండి స‌బ్సిడీల‌ను నిలిపి వేస్తున్న‌ట్లు మంత్రి వెల్ల‌డించారు. ఆమె మీడియాతో కూడా మాట్లాడారు. కాగా లెఫ్టినెంట్ గ‌వ‌ర్న‌ర్(Delhi LG) పొడిగించేందుకు ఫైల్ ను ఇంకా క్లియ‌ర్ చేయ‌లేదంటూ ఆరోపించింది. దీనిపై తీవ్రంగా ఖండించింది ఎల్జీ కార్యాల‌యం. ఫైల్ పై నిన్న‌నే సంత‌కం చేసిన‌ట్లు వెల్ల‌డించింది.

ఈ ఆరోప‌ణ‌లు నిరాధార‌మ‌ని పేర్కొంది. అన‌వ‌స‌ర రాజ‌కీయాలు మానుకోవాల‌ని అతిషికి సూచించింది. ఏప్రిల్ 4 వ‌ర‌కు నిర్ణ‌యాన్ని ఎందుకు పెండింగ్ లో ఉంచార‌ని , ఏప్రిల్ 15 వ‌ర‌కు గ‌డువు ముగుస్తున్న త‌రుణంలో ఏప్రిల్ 11న మాత్ర‌మే ఫైల్ ను ఎందుకు పంపారంటూ ఎల్జీ వివ‌ర‌ణ అడిగారు. మొత్తంగా ఆప్ , ఎల్జీ మ‌ధ్య వార్ మ‌ళ్లీ మొద‌లైంది.

ఆరోపణలను నిరాధారంగా పేర్కొంటూ, మిస్టర్ సక్సేనా కార్యాలయం “అనవసర రాజకీయాలు మానుకోవాలని అతిషికి సూచించింది. ఏప్రిల్ 4 వరకు నిర్ణయాన్ని ఎందుకు పెండింగ్‌లో ఉంచారని, ఏప్రిల్ 15 వరకు గడువు ముగియడంతో పాటు ఏప్రిల్ 11న మాత్రమే ఫైల్‌ను ఎందుకు పంపారని LG అడిగారు.

Also Read : సీఎం కేజ్రీవాల్ కు సీబీఐ స‌మ‌న్లు

Leave A Reply

Your Email Id will not be published!