Delhi Liquor Case : ఢిల్లీ లిక్కర్ మనీలాండరింగ్ కేసులో మరో అప్డేట్

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత సూత్రధారి, కథానాయిక అని విచారణ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది....

Delhi Liquor Case : ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో కవితను మార్చి 15న అరెస్టు చేసి, మరుసటి రోజు రౌస్ అవెన్యూలోని సీబీఐ కోర్టులో ఈడీ ఆమెను హాజరుపరిచిన సంగతి తెలిసిందే. అయితే ఈరోజు (శుక్రవారం) ఈ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చార్జిషీట్ దాఖలు చేసింది. బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితతోపాటు మరో నలుగురు నిందితులపై దర్యాప్తు సంస్థ చార్జిషీట్ దాఖలు చేసినట్లు తెలుస్తోంది.

Delhi Liquor Case Updates

ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో కవిత సూత్రధారి, కథానాయిక అని విచారణ సందర్భంగా ఈడీ కోర్టుకు తెలిపింది. విచారణ కొనసాగుతోందని, విచారణలో భాగంగా అదనపు చార్జిషీట్ దాఖలు చేస్తామని ఈడీ కోర్టుకు తెలియజేసింది. కవిత, చన్‌ప్రీత్ సింగ్, దామోదర్ శర్మ, ప్రిన్స్ కుమార్, అరవింద్ సింగ్ పాత్రలపై అదనపు చార్జ్ షీట్లు దాఖలయ్యాయి. 10 రోజుల నిర్బంధం తర్వాత… మార్చి 26 నుంచి కవిత తిహార్ జైలుకు వెళ్లనున్నారు.

ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయి ప్రస్తుతం తీహార్ జైలులో ఉన్న బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత(Kavitha) బెయిల్ పిటిషన్‌పై ఢిల్లీ హైకోర్టులో ఈరోజు (శుక్రవారం) విచారణ ముగిసింది. కవిత బెయిల్ దరఖాస్తుపై తదుపరి విచారణను మే 24కి వాయిదా వేసిన కోర్టు.కవిత బెయిల్ పిటిషన్‌పై వాదించేందుకు సమయం కావాలని ఈడీ కోరడంతో కోర్టు ఈ నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో తనపై నమోదైన మనీలాండరింగ్ కేసులో ట్రయల్ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్సీ కవిత ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసులో కవితను మార్చి 15న అరెస్టు చేశారు. ప్రస్తుతం ఆమె తీహార్ జైలులో ఉన్న సంగతి తెలిసిందే.

Also Read : AP Elections : ఇక ఏపీలో ఓట్ల పండగ మొదలైనట్టే…సొంత గూటికి చేరనున్న ఓటర్లు

Leave A Reply

Your Email Id will not be published!