Delhi Liquor Scam : కవితకు షాక్ ఈడీ సమన్లు
మరోసారి జారీ చేసిన దర్యాప్తు సంస్థ
Delhi Liquor Scam : హైదరాబాద్ – తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బిగ్ షాక్ తగిలింది. కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ మరోసారి సమన్లు జారీ చేసింది. దీంతో ఒక్కసారిగా కుదుపునకు లోనైంది బీఆర్ఎస్ . గత కొంత కాలం నుంచీ ప్రశాంతంగా ఉన్న ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు మరోసారి వెలుగులోకి వచ్చింది.
Delhi Liquor Scam Viral
ఇదే కేసుకు సంబంధించి అరుణ్ రామచంద్రన్ పిళ్లై అప్రూవర్ గా మారడంతో ఎమ్మెల్సీ కవితకు నోటీసులు అందుతాయని అంతా భావించారు. అనుకున్నంత లోపే సమన్లు జారీ చేయడం ప్రాధాన్యత సంతరిచుకుంది.
సెప్టెంబర్ 15న శుక్రవారం ఈడీ ముందు హాజరు కావాలని సమన్లలో పేర్కొంది. గత మార్చి నెలలో ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో మూడుసార్లు హాజరయ్యారు ఢిల్లీలో. పెద్ద ఎత్తున కల్వకుంట్ల కవిత(Kalvakuntla Kavitha) అరెస్ట్ అవుతారని అంతా భావించారు.
ఏమైందో ఏమో కానీ ఉన్నట్టుండి స్కామ్ కు సంబంధించి అంతా మౌనంగా ఉన్నారు. ఈ సమయంలో తాజాగా సమన్లు జారీ చేయడంతో ఒక్కసారిగా కల్వకుంట్ల ఫ్యామిలీలో, బీఆర్ఎస్ శ్రేణుల్లో కదలిక మళ్లీ మొదలైంది.
ఇప్పటి వరకు కేసుకు సంబంధించి ఈడీ సంచలన ఆరోపణలు చేసింది. కవితకు బినామీ అరుణ్ రామచంద్రన్ పిళ్లై అని స్పష్టం చేసింది.
Also Read : Pawan Kalyan : కలిసి నడుద్దాం పోరాడుదాం