Delhi Liquor Scam ED : 9 జోన్లపై సౌత్ గ్రూప్ పట్టు – ఈడీ
ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కూడా
Delhi Liquor Scam ED : కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ సంచలన ప్రకటన చేసింది. శుక్రవారం ఢిల్లీ లిక్కర్ స్కాంకు సంబంధించి తీవ్ర ఆరోపణలు ఎదుర్కొని తీహార్ జైలులో ఉన్న ఆప్ నేత, మాజీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను ఢిల్లీ కోర్టులో హాజరు పరిచింది. ఇప్పటికే రెండో ఛార్జ్ షీట్ లో తెలంగాణ సీఎం కేసీఆర్ కూతురు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత , సీఎం కేజ్రీవాల్ ను చేర్చింది. ఇందుకు సంబంధించి మార్చి 11న విచారణకు హాజరు కావాల్సిందిగా ఈడీ ఎమ్మెల్సీ కవిత కు నోటీసు పంపించింది.
ఆమె తెలివిగా మహిళా రిజర్వేషన్ బిల్లు కావాలంటూ జంతర్ మంతర్ వద్ద దీక్ష చేపట్టింది. ఇది పక్కన పెడితే ఇవాళ ఈడీ కోర్టుకు మద్యం పాలసీని ఎలా మాన్యూప్ లేట్ చేశారో, ఎవరికి లాభం చేకూర్చేలా కట్టబెట్టారనేది పూసగుచ్చినట్లు తెలిపింది. అందరూ అనుకున్నంత అమాయకుడు సిసోడియా కాదని పేర్కొంది. ఆయన ఎవరికీ అనుమానం రాకుండా తన ఫోన్లను ధ్వంసం చేశాడని ఆరోపించింది ఈడీ.
అంతే కాదు ఇతరుల ఫోన్లతో మొత్తం కథంతా నడిపించాడని పేర్కొంది. 12 శాతం లాభం కలిగేలా ప్లాన్ చేశారని తెలిపింది. ఇందులో సౌత్ గ్రూప్ కు లాభం వచ్చేలా చేశారంటూ ఆరోపించింది. ఇందులో ఎమ్మెల్సీ కవిత పేరు ప్రత్యేకంగా ప్రస్తావించింది కేంద్ర దర్యాప్తు సంస్థ.
సౌత్ కార్టెల్ (గ్రూప్ )తో పాటు విజయ్ నాయర్ , ఇతరులతో కలిసి ఈ విధానం వెనుక కుట్ర జరిగందని ఈడీ తరపు న్యాయవాది ఆరోపించారు. తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో కూడిన సౌత్ గ్రూప్ 9 జోన్లపై పట్టు సాధించిందని , ఢిల్లీ లోని ఎక్సైజ్ వ్యాపారంలో(Delhi Liquor Scam ED) తీవ్రమైన వాటాదారుగా మారిందని కోర్టుకు తెలిపింది.
Also Read : స్వంత ఫోన్లు ధ్వంసం చేసిన సిసోడియా