Delhi MCD Polls 2022 : ఢిల్లీ బల్దియా ఎన్నికల పోలింగ్ షురూ
ఉదయం 8 నుంచి సాయంత్రం దాకా
Delhi MCD Polls 2022 : దేశ రాజధానిలో కొలువు తీరిన ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వ పనితీరుకు అగ్ని పరీక్ష. ఎలాగైనా సరే ఢిల్లీ మహానగర కార్పొరేషన్ (ఎంసీడీ) పై కాషాయ జెండా ఎగుర వేయాలని భారతీయ జనతా పార్టీ శత విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. ఇక ఆప్, బీజేపీతో పాటు కాంగ్రెస్, ఎంఐఎం ఈసారి సత్తా చాటాలని చూస్తున్నాయి.
అవినీతి ఆరోపణలు, ఢిల్లీ లిక్కర్ స్కాం ఆప్ ను ఇరకాటంలోకి నెట్టేసింది. ఇందులో భాగంగా అన్ని పార్టీలు బరిలో ఉన్నా ఆప్ వర్సెస్ బీజేపీగా మారింది. చాలా కాలం తర్వాత ఎంసీడీ ఎన్నికలు(Delhi MCD Polls 2022) జరుగుతున్నాయి. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది.
సాయంత్రం 5.30 గంటల దాకా ఓటు వేసేందుకు ఛాన్స్ ఉంది. ఢిల్లీ రాష్ట్ర ఎన్నికల సంఘం విస్తృత ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే అందరి ఫోకస్ కేపిటల్ సిటీపై పడింది. వరుసగా నాలుగోసారి కైవసం చేసుకోవాలని ఆప్ ఫోకస్ పెట్టింది. ఇక పార్లమెంటరీ, అసెంబ్లీ, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 2015 నుంచి ఢిల్లీలో వరుసగా పరాజయాన్ని చవి చూసింది కాంగ్రెస్ పార్టీ.
ఈసారి చెప్పు కోదగిన రీతిలో ప్రదర్శన చేపట్టింది. తమను తాము కాపాడు కునేందుకు ప్రయత్నం చేస్తోంది. మహానగర కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. అన్ని మార్కెట్లు మూసి ఉంచారు. ఎంసీడీలో మొత్తం 250 వార్డులు ఉన్నాయి. 1.5 కోట్ల మంది ఓటర్లు ఉన్నాయి. ఉదయం 4 గంటల నుంచచే మెట్రో సేవలు అందుబాటులోకి వచ్చాయి.
Also Read : కొలీజియంపై ‘జగదీప్’ షాకింగ్ కామెంట్స్