Satyendar Jain : ఢిల్లీ మంత్రి జైన్ నివాసాలలో ఈడీ దాడులు
ఇప్పటికే మనీ లాండరింగ్ పై కేసు
Satyendar Jain : మనీ లాండరింగ్ కు పాల్పడిన కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ ప్రభుత్వానికి చెందిన ఢిల్లీ ఆరోగ్య శాఖ మంత్రి సత్యేంద్ర జైన్(Satyendar Jain) కు సంబంధించిన ఇళ్లపై ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోదాలు చేపట్టింది.
ఢిల్లీలోని జైన్ నివాస ప్రాంగణాలు, కొన్ని ఇతర ప్రదేశాలలో దాడులు కొనసాగుతున్నాయి. ఇదిలా ఉండగా మనీ లాండరింగ్ కేసులో సత్యేంద్ర జైన్ ను గత నెల మే 30న అరెస్ట్ చేశారు.
అనంతరం కోర్టులో హాజరు పరిచారు. ఆయనకు బెయిల్ ఇచ్చేందుకు కోర్టు తిరస్కరించింది. ఈనెల 9 వరకు ఈడీ కస్టడీకి అప్పగించింది. సోమవారం ఉదయం సత్యేంద్ర జైన్(Satyendar Jain) కు చెందిన ఇళ్లు, ఇతర ప్రాంతాలలో ముమ్మరంగా సోదాలు చేపట్టింది.
జైన్ అరెస్ట్ పై ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ , ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ తీవ్రంగా తప్పు పట్టారు. తాము ఎలాంటి అవినీతి, అక్రమాలకు పాల్పడలేదని ఆరోపించారు.
కావాలని కక్ష సాధింపు చర్యలకు కేంద్రం పాల్పడుతోందంటూ సీఎం మండిపడ్డారు. ఇప్పటికే జైన్ పై నమోదు చేసిన కేసుకు సంబంధంచి ఎలాంటి ఆధారాలు లభించ లేదన్నారు.
కావాలని కక్ష సాధింపు ధోరణితో కేంద్రం వ్యవహరిస్తోందంటూ మండిపడ్డారు. మరో సంచలన కామెంట్స్ కూడా చేశారు. తదుపరి అరెస్ట్ ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను అరెస్ట్ చేయనున్నట్లు తనకు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందని అన్నారు సీఎం.
దీంతో ఆప్ వర్సెస్ కేంద్రంగా మారింది. ఇరు వర్గాలు ఒకరిపై మరొకరు ఆరోపణలు చేసుకుంటున్నారు. ఈ తరుణంలో జైన్ అరెస్ట్ ఇప్పుడు చర్చకు దారి తీసింది.
Also Read : బీజేపీ దృష్టిలో అన్ని మతాలు ఒక్కటే