Air India : ఎయిర్ ఇండియా సంచలన నిర్ణయం తీసుకుంది. ఇన్సూరెన్స్ సమస్యల కారణంగా ఢిల్లీ నుంచి మాస్కో వెళ్లే విమానాన్ని రద్దు చేసింది. దీంతో ఎయిర్ ఇండియా టికెట్ల విక్రయాన్ని నిలిపి వేసింది.
ఈ విషయాన్ని రష్యా రాయాబార కార్యాలయం ప్రకటించింది. ఇదిలా ఉండగా ఎయిర్ ఇండియా (Air India )ఢిల్లీ నుంచి మాస్కోకు వారానికి ఒకసారి విమానాన్ని నడుపుతోంది.
ఉక్రెయిన్ పై రష్యా దాడికి ముప్పు ఎక్కువగా ఉన్నందు వల్ల బీమా కరేజీని పొందలేక పోయింది. ఎయిర్ ఇండియా ఢిల్లీ నుంచి మాస్కోకు వారానికి రెండు సార్లు విమానాన్ని రద్దు చేయడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు ట్రావెలర్స్.
దీంతో విమాన అవకాశాలు అస్పష్టంగా ఉన్నాయని రష్యా ఎంబసీ వెల్లడించింది. ప్రియమైన తోటి పౌరులారా, ప్రయాణికుల్లారా భారత విమానాయన సంస్థ ఎయిర్ ఇండియా ఢిల్లీ మాస్కో మార్గంలో టికెట్ల నిలిపి వేసిందని తెలియ చేస్తున్నాం.
ఈ విషయాన్ని మీ దృష్టికి వస్తున్నామని తెలిపింది ఎంబసీ. కాగా ఎయిర్ ఇండియా ఆఫీసు తెలిపిన వివరాల ప్రకారం రద్దయిన విమానాల కోసం ప్రయాణికులు పూర్తిగా వచ్చేందుకు అర్హులని వెల్లడించింది.
రష్యన్ ఎంబసీ తన టెలిగ్రామ్ ఛానల్ ద్వారా ఓ ప్రకటన ద్వారా స్పష్టం చేసింది. కాగా తాష్కెంట్, ఇస్తాంబుల్, దుబాయ్, అబుదాబి, దోహా, ఇతర గమ్య స్థానాల ద్వారా రవాణా మార్గాలను ఉపయోగించి ఢిల్లీ నుంచి మాస్కోకు వెళ్లడం సాధ్యమేనని రష్యా ఎంబసీ తెలిపింది.
దీనిపై కేంద్ర పౌర విమానయాన శాఖ ఇంకా స్పందించ లేదు.
Also Read : కుబేరుల్లో ముకేశ్ అంబానీ టాప్