Delhi Police Case : మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై కేసు న‌మోదు

ఢిల్లీ ఖాకీల నిర్వాకంపై ఆగ్ర‌హం

Delhi Police Case : ఢిల్లీ పోలీసులు స‌రికొత్త చ‌రిత్ర సృష్టించారు. తామే దాడుల‌కు పాల్ప‌డ‌ట‌మే కాకుండా బాధితుల‌పై కేసు న‌మోదు చేశారు. దేశం యావ‌త్తు ఖాకీలు ప్ర‌వ‌ర్తించిన తీరుపై ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భార‌త రెజ్ల‌ర్ల స‌మాఖ్య చీఫ్ ను అరెస్ట్ చేయాల‌ని కోరుతూ మ‌హిళా రెజ్ల‌ర్లు దేశ రాజ‌ధాని ఢిల్లీలో(Delhi) భారీ నిర‌స‌న చేప‌ట్టారు. నూత‌న పార్ల‌మెంట్ కు ర్యాలీగా వెళ్లాల‌ని ప్ర‌య‌త్నం చేశారు. ఈ స‌మ‌యంలో ఖాకీలు రెచ్చి పోయారు. మ‌హిళ‌లు అని చూడ‌కుండా వారిపై దాడికి పాల్ప‌డ్డారు. అస‌భ్య ప్ర‌వ‌ర్త‌న‌తో త‌ల వంచుకునేలా చేశారు.

త‌మ అస‌మాన ప్ర‌తిభా నైపుణ్యాల‌తో దేశానికి పేరు తీసుకు వ‌చ్చిన మ‌హిళా రెజ్ల‌ర్ల ప‌ట్ల ఖాకీలు అనుస‌రించిన వైఖ‌రిపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తమైంది విప‌క్షాల నుండి. ఏఐసీసీ మాజీ చీఫ్ రాహుల్ గాంధీ, ప్ర‌ధాన కార్య‌దర్శి ప్రియాంక గాంధీ, శివ‌సేన యూబీటీ ఎంపీ ప్రియాంక చ‌తుర్వేది, ఎంపీ , అధికార ప్ర‌తినిధి సంజ‌య్ రౌత్ , ఢిల్లీ సీఎం అర‌వింద్ కేజ్రీవాల్ , త‌దిత‌రులు సీరియ‌స్ గా స్పందించారు. ఇక ఢిల్లీ మ‌హిళా క‌మిష‌న్ చైర్ ప‌ర్స‌న్ స్వాతి మ‌లివాల్ నిప్పులు చెరిగింది.

ఢిల్లీ ఖాకీల‌పై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. పోలీస్ క‌మిషనర్ కు లేఖ రాసింది. వెంట‌నే డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ బ్రిజ్ భూష‌ణ్ శ‌ర‌ణ్ సింగ్ పై చర్య‌లు తీసుకోవాల‌ని కోరింది. ఇదిలా ఉండ‌గా మ‌హిళా రెజ్ల‌ర్ల‌ను బ‌ల‌వంతంగా అరెస్ట్ చేశారు పోలీసులు. అయితే వారిపై పోలీసు కేసు న‌మోదు చేయ‌డం విస్తు పోయేలా చేసింది. ఖాకీల పై తిరిగి కేసు న‌మోదు చేయాల‌ని విప‌క్షాలు డిమాండ్ చేస్తున్నాయి.

Also Read : Rajasthan Congress Row

 

Leave A Reply

Your Email Id will not be published!