Prophet Row : నిర‌స‌న‌కారుల‌పై కేసు న‌మోదు

కోవిడ్ రూల్స్ అతిక్ర‌మించార‌ని

Prophet Row : మ‌హ్మ‌ద్ ప్ర‌వ‌క్త పై వ్యాఖ్య‌ల‌ను నిర‌సిస్తూ(Prophet Row)  ఢిల్లీలోని జామా మ‌సీదు వ‌ద్ద పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు. ఇందులో 500 మందికి పైగా ఉన్న‌ట్లు పోలీసులు గుర్తించారు.

కోవిడ్ రూల్స్ ను పాటించ‌నందుకు వారంద‌రిపై కేసు న‌మోదు చ‌సిన‌ట్లు వెల్ల‌డించారు. కాగా మ‌సీదు మెట్ల‌పై 20 నిమిషాల పాటు వారంతా నిర‌స‌న తెలిపారు.

ప్ర‌వ‌క్త‌పై కామెంట్స్ చేసిన వారిని అరెస్ట్ చేయాల‌ని కోరారు. మ‌సీదుతో పాటు ప‌రిస‌ర ప్రాంతాల‌లో గుమి గూడారు. దీంతో క‌రోనా వైర‌స్ ఇంకా స‌మిసి పోలేద‌ని , ఇప్ప‌టికే ఢిల్లీ కోర్టు మాస్క్ లు వేసుకోక పోతే జ‌రిమానా విధించాల‌ని తీర్పు చెప్పింది.

క‌రోనా కార‌ణంగా ఢిల్లీలో బ‌హిరంగ నిర‌స‌న‌లు(Prophet Row) , స‌మావేశాలు నిర్వ‌హించ కూడ‌ద‌ని పోలీసులు ఇప్ప‌టికే స్ప‌ష్టం చేశారు. కానీ ప్ర‌వ‌క్త పేరుతో పెద్ద ఎత్తున ఒకే చోట గుమిగూడ‌డం, వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డాన్ని తీవ్రంగా ప‌రిగ‌ణ‌లోకి తీసుకున్న‌ట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు.

పెద్ద ఎత్తున ప్ర‌భుత్వంపై నూపుర్ శ‌ర్మ‌, జిందాల్ కు వ్య‌తిరేకంగా నినాదాలు చేయ‌డాన్ని తప్పు ప‌ట్టారు. గుమిగూడిన వారంద‌రినీ చెద‌రగొట్టామ‌ని తెలిపారు.

ఈ సంద‌ర్భంగా సీనియ‌ర్ పోలీస్ అధికారి శ్వేతా చౌహాన్ మాట్లాడారు. శుక్ర‌వారం ప్రార్థ‌న‌ల కోసం దాదాపు 1,500 మంది మ‌సీదు వ‌ద్ద‌కు చేరారు. ప్రార్థ‌న‌లు శాంతియుతంగా ముగిశాయి.

అనంత‌రం బ‌య‌ట‌కు వ‌చ్చి ప్ల‌కార్డులు ప్ర‌ద‌ర్శించారు. నినాదాలు చేశారు. మ‌రికొంద‌రు వారితో చేరార‌ని తెలిపారు. కొంత మంది దుర్మార్గుల‌ను గుర్తించ‌డం జ‌రిగింద‌న్నారు.

వీరిని గుర్తించే ప‌నిలో పోలీసు బృందాలు గాలిస్తున్నాయ‌ని చెప్పారు.

Also Read : రాష్ట్ర‌ప‌తి ఎన్నిక‌పై ఎడ‌తెగ‌ని ఉత్కంఠ

Leave A Reply

Your Email Id will not be published!