Rahul Gandhi Notice : రాహుల్ కు ఢిల్లీ పోలీస్ నోటీస్
నిప్పులు చెరిగిన కాంగ్రెస్ పార్టీ
Rahul Gandhi Police Notice : ఢిల్లీ పోలీసులు కాంగ్రెస్ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీకి ఢిల్లీ పోలీసులు నోటీసు ఇవ్వడం కలకలం రేపింది. దీనిపై తీవ్రంగా మండిపడింది కాంగ్రెస్ పార్టీ. లైంగిక వేధింపులకు సంబంధించి తనను సంప్రదించిన మహిళల వివరాలు తెలియ చేయాలని కోరుతూ పోలీసులు రాహుల్ గాంధీకి నోటీసు పంపారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ(Rahul Gandhi Police Notice) లైంగిక వేధింపుల బాధితుల గురించి ప్రస్తావించారు. దీనిపై తమ నాయకుడికి నోటీసులు ఇవ్వడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ . ప్రభుత్వ భయాందోళనలకు మరో నిదర్శనం అని పేర్కొంది.
ప్రజాస్వామ్యం, మహిళా సాధికారత , భావ ప్రకటనా స్వేచ్ఛ, ప్రతిపక్ష పాత్రను బలహీన పర్చేందుకు పాలకపక్షం పన్నిన కుట్రగా ఆరోపించింది పార్టీ. మహిళలు ఇప్పటికీ లైంగిక వేధింపులకు గురవుతున్నారంటూ రాహుల్ గాంధీ(Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలపై పోలీసులు లేటుగా స్పందించారు. ఈ మేరకు నోటీసులు జారీ చేయడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది కాంగ్రెస్ . ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ , గౌతమ్ అదానీ సంబంధాలపై రాహుల్ గాంధీ పదే పదే ప్రస్తావిస్తున్నారు. ప్రశ్నలు సంధిస్తున్నారు.
దీంతో జవాబు ఇవ్వలేని స్థితిలో మోదీ సర్కార్ ఉంది. అందుకే కొత్తగా మరో డ్రామాకు తెర లేపిందంటూ కాంగ్రెస్ పార్టీ నిప్పులు చెరిగింది. చట్టానికి అనుగుణంగా తాము నోటీసుకు తగిన సమయంలో ప్రతిస్పందిస్తామని స్పష్టం చేసింది. చిత్రాలు స్వీయ వివరణాత్మకమైనవని పేర్కొంది. శ్రీనగర్ లో భారత్ జోడో యాత్ర ముగింపు సందర్బంగా ఇద్దరు మహిళలు తమ గ్యాంగ్ రేప్ గురించి తనతో చెప్పిన సంఘటన గురించి తెలిపారు.
Also Read : ఏంపీని నోరు మూసుకోమంటే ఎలా