Delhi Police FIR : రెజ్ల‌ర్ల నిర‌స‌న‌ను అనుమ‌తించం

ప్ర‌క‌టించిన ఢిల్లీ పోలీసులు

Delhi Police FIR : మ‌హిళా రెజ్ల‌ర్లపై దారుణంగా ఢిల్లీ పోలీసులు(Delhi Police) ప్ర‌వ‌ర్తించిన తీరుపై దేశ వ్యాప్తంగా నిర‌స‌న వ్య‌క్తం అవుతోంది. స‌భ్య స‌మాజం సిగ్గు ప‌డేలా మ‌గ పోలీసులు మ‌హిళా రెజ్ల‌ర్ల ప‌ట్ల అనుస‌రించిన అస‌భ్య‌క‌ర‌మైన ప్ర‌వ‌ర్త‌నపై ఆగ్ర‌హం వ్య‌క్తం అవుతోంది. ఖాకీలే దాడికి పాల్ప‌డ్డారు. ఆపై బాధిత మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై కేసు న‌మోదు చేశారు. దీనిపై ఆప్, కాంగ్రెస్, శివ‌సేన‌, టీఎంసీ పార్టీలు తీవ్రంగా కండించాయి. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నాయి.

ఇదిలా ఉండ‌గా జంత‌ర్ మంత‌ర్ వ‌ద్ద ఎలాంటి అనుమ‌తి లేద‌ని ఇప్ప‌టికే రెజ్ల‌ర్ల‌కు స్ప‌ష్టం చేశామ‌ని చెప్పారు ఢిల్లీ పోలీసులు(Delhi Police). ప‌ర్మిష‌న్ లేకుండా కొత్త పార్ల‌మెంట్ భ‌వ‌నం వ‌ర‌కు మార్చ్ చేప‌డ‌తామంటే తాము ఎలా ఊరుకుంటామ‌ని ప్ర‌శ్నించారు. ఇదిలా ఉండ‌గా సంయుక్త కిసాన్ మోర్చా రైతు నాయ‌కులు ఖాకీల‌పై భ‌గ్గుమ‌న్నారు. ఏదో ఒక రోజు ఢిల్లీ కోట‌పై తాము కూడా జెండా ఎగుర వేస్తామ‌ని హెచ్చ‌రించాయి.

మ‌హిళా రెజ్ల‌ర్ల‌పై పోలీసుల దాడులు ముమ్మాటికీ గ‌ర్హ‌నీయమ‌ని పేర్కొన్నాయి. దీనిని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టాయి. ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాను ఖాకీల నిర్వాకానికి సంబంధించిన ఫోటోలు హ‌ల్ చ‌ల్ చేస్తున్నాయి. ఇప్ప‌టికే కేంద్ర స‌ర్కార్ అనుస‌రిస్తున్న వైఖ‌రి అనుమానాస్పదంగా ఉంది. క్రీడా మంత్రి నిద్ర పోతున్నారు. మోదీ ప్ర‌చారానికే ప‌రిమిత‌మై పోయారు. ఇక హోం మంత్రి క‌ర్ణాట‌క ఫ‌లితాల త‌ర్వాత మ‌ణిపూర్ హింస‌పై ఫోక‌స్ పెట్టారు. ఇదీ ప‌రిస్థితి.

Also Read : Bajarang Punia

Leave A Reply

Your Email Id will not be published!