Ratan Lal Professor : ఢిల్లీ ప్రొఫెసర్ కు బెయిల్ మంజూరు
జ్ఞాన్ వాపి మసీదుపై పోస్ట్ పై అరెస్ట్
Ratan Lal Professor : వారణాసిలోని జ్ఞాన్ వాపి మసీదు సముదాయంలో దొరికిన శివలింగం పై ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు గత రాత్రి అరెస్ట్ చేశారు ఢిల్లీ యూనివర్శిటీ హిందూ కాలేజీ చరిత్ర ప్రొఫెసర్ రతన్ లాల్ ను.
ఈ మేరకు తన అరెస్ట్ ను నిరసిస్తూ పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారించిన కోర్టు రతన్ లాల్ కు బెయిల్ మంజూరు చేసింది. రతన్ లాల్ ను ఉత్తర ఢిల్లీలోని సైబర్ పోలీస్ స్టేషన్ అధికారులు అరెస్ట్ చేశారు.
మత ప్రాతిపదికన సమూహాల మధ్య శత్రుత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని, సామరస్య పరిరక్షణకు విఘాతం కలిగించే చర్యలకు పాల్పడుతున్నాడంఊ రతన్ లాల్ పై అభియోగాలు మోపారు.
శుక్రవారం రాత్రి రతన్ లాల్ ను అరెస్ట్ చేయగా శనివారం మధ్యాహ్నం కోర్టులో హాజరు పరిచారు. రతన్ లాల్(Ratan Lal Professor) తరపు లాయర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకున్నారు.
ఇదిలా ఉండగా రతన్ లాల్ పై ఇప్పటి వరకు ఆరు ఫిర్యాదులు అందాయని, ఈ కేసును దర్యాప్తు చేసేందుకు ఢిల్లీ పోలీసులు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ కోరారు.
యూట్యూబ్ వీడియోల లోని పోస్ట్ లను కూడా ప్రొఫెసర్ సమర్థిస్తున్నారంటూ ఢిల్లీ పోలీసుల తరపు న్యాయవాది విన్నవించారు. రతన్ లాల్(Ratan Lal Professor) తరపు న్యాయవాది ఆయన అరెస్ట్ ను పూర్తిగా ఖండించారు.
ఇది భావ ప్రకటనా స్వేచ్ఛకు పూర్తిగా విరుద్దంగా ఉందన్నారు. ఇక్కడ ఎలాంటి కేసు లేదని, ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయకూడదన్నారు.
ఎలాంటి నోటీసులు లేకుండా ప్రొఫెసర్ ను అరెస్ట్ చేసిన పోలీసులపై శాఖా పరమైన విచారణ జరిపించాలని న్యాయవాది డిమాండ్ చేశారు.
Also Read : మోదీ ప్రభుత్వం దేశానికి శాపం