Delhi Strong Winds : ఢిల్లీలో గాలి వాన బీభత్సం

బ‌ల‌మైన ఈదురు గాలుల‌తో పరేషాన్

Delhi Strong Winds : దేశ రాజ‌ధాని ఢిల్లీ(Delhi Strong Winds) లో అనుకోకుండా భారీగా ఈదురు గాలులు వీచాయి. వ‌డ‌గ‌ళ్ల వాన కురిసింది. రోడ్ల‌పై ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఎక్క‌డికక్క‌డ భారీ వాహ‌నాలు, కార్లు, ఆటోలు నిలిచి పోయాయి.

కొన్ని ప్రాంతాల్లో ఈ సాయంత్రం మోస్త‌రు, తీవ్ర వ‌ర్షం కురిసింది. పెద్ద ఎత్తున గాలులు వీస్తూనే ఉన్నాయి. వేడి త‌రంగాల కార‌ణంగా న‌గ‌రం కాస్తా చ‌ల్ల బ‌డింది.

ఇదిలా ఉండ‌గా పెద్ద ఎత్తున కురిసిన వ‌ర్షం దెబ్బ‌కు విమాన రాక‌పోక‌లు నిలిపి వేశారు కొద్ది సేపు. తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. విచిత్రం ఏమిటంటే గ‌డ్డ క‌ట్టిన మంచు ముక్క‌లు, మోటారు సైకిల్ దారుల‌ను తాకాయి.

చాలా చోట్ల ఇంకా ట్రాఫిక్ జామ్ ఏర్ప‌డింది. ఇక ఫ్లైట్ ట్రాకింగ్ పోర్ట‌ల్స్ ఇందిరాగాంధీ అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యంపై అనేక ప్ర‌యాణీకుల విమానాలకు కింద‌కు దిగేందుకు ప‌ర్మిష‌న్ ఇవ్వ‌క పోవ‌డంతో తిరుగుతుండ‌డం కొంత ఆందోళ‌న క‌లిగిస్తోంది.

వాతావ‌ర‌ణం క్లియ‌ర్ అయ్యేంత వ‌ర‌కు వేచి ఉండాల్సిన ప‌రిస్థితి నెల‌కొంది. దీని కార‌ణంగా చాలా ఫ్లైట్స్ రాక‌పోక‌ల‌కు తీవ్ర అంత‌రాయం ఏర్ప‌డింది. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు విమాన స‌మ‌యాలలో మార్పులు చోటు చేసుకునే అవ‌కాశం ఎక్కువ‌గా ఉంది.

ఢిల్లీ(Delhi Strong Winds) లో వాన‌లు, ఉరుములు త‌మ విమాన కార్య‌క‌లాపాలపై ప్ర‌భావం చూపుతాయి. ద‌య‌చేసి ఎటువంటి అవాంత‌రాలు క‌ల‌గ‌కుండా ఉండేందుకు త‌గినంత ప్ర‌యాణ స‌మమ‌యాన్ని చేతిలో పెట్టుకోండి.

మీ విమాన స్థితిని చెక్ చేసుకోండి. ఏదైనా సాయం కోసం త‌మ‌కు ట్బిట్ట‌ర్ లో లేదా ఫేస్ బుక్ లో తెలియ చేయండి అంటూ ఇండిగో కోరింది.

Also Read : గ‌వ‌ర్న‌ర్ ఆదేశం అభిషేక్ ఆగ్ర‌హం

Leave A Reply

Your Email Id will not be published!