Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్ , మాజీ సీఎం అఖిలేష్ యాదవ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తాజాగా యూపీలో అసెంబ్లీ ఎన్నికలు ముగిశాయి.
చివరి దాకా పోటీ ఇస్తుందని ఆశించిన ఎస్పీకి కోలుకోలేని షాక్ తగిలింది బీజేపీ రూపంలో. ఎన్నికల ఫలితాల అనంతరం మొదటిసారిగా అఖిలేష్ యాదవ్ మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా కీలక కామెంట్స్ చేశారు. 75 ఏళ్ల స్వాతంత్యాన్ని పురస్కరించుకొని దేశం అమృత్ మహోత్సవ్ ను జరుపుకుంటోందని , దీంతో పోరాట విలువలు పూర్తిగా పక్కదారి పట్టాయని ఆరోపించారు.
దేశంలో పూర్తిగా ప్రజాస్వామ్యం పక్కదారి పట్టిందని, ఒకరకంగా చెప్పాలంటే ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. బీజేపీ పోల్ మేనేజ్ మెంట్ చేయడంలో సక్సెస్ అయ్యిందన్నారు.
ఈవీఎంల కంటే బ్యాలెట్ పద్దతిలో నిర్వహించి ఉన్నట్లయితే తమకు 304 సీట్లకు పైగా వచ్చేవన్నారు మాజీ సీఎం. మాయ మాటలు చెబుతూ, ప్రభుత్వ సంస్థలను నిర్వీర్యం చేస్తూ దేశాన్ని సర్వనాశనం చేస్తున్నారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
ఎన్నికల సమయంలోనే మతం, కులం, ప్రాంతం తెరపైకి వస్తుందని ఆ తర్వాత దాని ఊసే ఉండదన్నారు. బీజేపీ నిర్వాకం వల్ల రాజకీయాలు పూర్తిగా కలుషితం అయ్యాయని మండిపడ్డారు.
ఆ పార్టీ పూర్తిగా వంచన రాజకీయాలు చేస్తోందంటూ ఫైర్ అయ్యారు. రాజ్యాంగాన్ని పరిరక్షించడంలో ఎన్నికల సంఘం స్వతంత్ర పాత్ర ఉండాల్సిన అవసరం ఉందన్నారు.
ఓట్ల పరంగా బీజేపీ గెలిచి ఉండవచ్చని కానీ నైతికంగా చూస్తే సమాజ్ వాది పార్టీ విజయం సాధించిందని అన్నారు ఎస్పీ చీఫ్.
Also Read : బ్యాలెట్ అయితే ఎస్పీ గెలిచేది