Tripura EX-CM Manik Sarkar : త్రిపురలో ప్రజాస్వామ్యం ఖూనీ – సర్కార్
మాజీ సీఎం ప్రధానిపై మండిపాటు
Tripura EX-CM Manik Sarkar : త్రిపుర మాజీ సీఎం మాణిక్ సర్కార్ కీలక వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. త్రిపురలో కొలువు తీరిన భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వల్ల ప్రజాస్వామ్యం ఖూనీ అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు. లెఫ్ట్ – కాంగ్రెస్ కూటమిగా ఏర్పడడం వల్ల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర అసంతృప్తితో ఉన్నారని మండిపడ్డారు. ఇదిలా ఉండగా ఈ కూటమి గురించి మోదీ ఎద్దేవా చేశారు. దీనిపై తీవ్రంగా స్పందించారు మాజీ సీఎం(Tripura EX-CM Manik Sarkar) .
రాష్ట్రంలో రాచరిక పాలన సాగుతోందని, జవాబుదారీ తనం లేకుండా పోయిందని ఆరోపించారు. బీజేపీ ఎక్కడా రాజ్యాంగాన్ని అనుసరించడం లేదన్నారు. వారికి రాజ్యాంగం అంటే ఓ బూతు లాగా వినిపిస్తోందంటూ సంచలన కామెంట్స్ చేశారు. రాష్ట్రంలో ఫాసిస్టు పాలన అంతం చేసేందుకు ప్రత్యర్థులుగా ఇప్పటి వరకు ఉన్న కాంగ్రెస్ ,కమ్యూనిస్టులు కలిశారంటూ చెప్పారు.
ఈనెల 11న త్రిపురలో ఎన్నికల ర్యాలీ చేపట్టారు. రెండు పార్టీలను ఆయన టార్గెట్ చేశారు. అందుకే ఎవరు ఫాసిస్టు భావజాలాన్ని కలిగి ఉన్నారో ప్రజలకు తెలుసన్నారు. మాయ మాటలు చెప్పడం తప్పితే ఒక్క పనైనా చేశారా అని ప్రశ్నించారు మాణిక్ సర్కార్(Tripura EX-CM Manik Sarkar). కేరళలో సీపీఎం పవర్ లో ఉంది. అక్కడ కాంగ్రెస్ ప్రతిపక్షంలో ఉంది. కానీ త్రిపురలో లేని ప్రజాస్వామ్యం అక్కడ సజీవంగా ఉందన్నారు మాజీ సీఎం.
ప్రధాని ఎన్నికల ప్రచారం కోసం రెండుసార్లు రాష్ట్రంలో పర్యటించారు. కానీ 2018 అసెంబ్లీ ఎన్నికలకు ముందు ఆవిష్కరించిన విజన్ డాక్యుమెంట్ ను ప్రస్తావించకుండానే వెళ్లి పోయారంటూ ఎద్దేవా చేశారు మాణిక్ సర్కార్.
Also Read : మొఘల్ చరిత్రను మార్చలేదు – షా