Akhilesh Yadav : బీజేపీ పాలనలో డెమోక్రసీ మర్డర్ – అఖిలేష్
యూపీ ఉప ఎన్నికల్లో ఓటమిపై కామెంట్స్
Akhilesh Yadav : సమాజ్ వాది పార్టీ చీఫ్, మాజీ సీఎం అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav) షాకింగ్ కామెంట్స్ చేశారు. ఉత్తర ప్రదేశ్ లోని రాంపూర్ , అజంగఢ్ నియోజకవర్గాలకు జరిగిన ఉప ఎన్నికల్లో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ అభ్యర్థులు ఘన విజయాన్ని సాధించారు.
ఈ రెండు నియోజకవర్గాలలో ఎస్పీకి గట్టి పట్టుగా ఉంటూ వచ్చాయి. ఒక రకంగా చెప్పాలంటే ఆ పార్టీకి కంచుకోట. బీజేపీ పాలనలో ప్రజాస్వామ్యం హత్యకు గురైందని ఆరోపించారు అఖిలేష్ యాదవ్.
బెదిరింపులకు గురి చేయడం, దాడులు, కేసులు నమోదు చేయడం షరా మామూలై పోయిందని పేర్కొన్నారు. ఈ ఫలితాలు తాము ముందే ఊహించామన్నారు.
ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరగలేదని, దీని గురించి ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిదన్నారు ఎస్పీ చీఫ్. నామినేషన్ల తిరస్కరణకు కుట్ర తెర లేపారు. అభ్యర్థులను ప్రచారం చేయనీయకుండా అడుగడుగునా అడ్డుకున్నారు.
ఆపై సమాజ్ వాది పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను భయభ్రాంతులకు గురి చేశారు. కేసులతో భయభ్రాంతులకు గురి చేశారు.
ఇక పోలింగ్ వరకు కూడా ఓట్లు వేయనీయకుండా అడ్డుకున్నారని అందుకే బీజేపీ గెలవ గలిగిందని మండిపడ్డారు అఖిలేష్ యాదవ్(Akhilesh Yadav).
ప్రభుత్వ యంత్రాంగాన్ని దుర్వినియోగం చేశారని, కౌంటింగ్ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని, ఇదేమని ప్రశ్నించిన ప్రజా ప్రతినిధులపై ఒత్తిళ్లు తీసుకు వచ్చారంటూ సంచలన ఆరోపణలు చేశారు.
ప్రజాస్వామ్యం రక్తిసిక్తమైంది. ప్రజా తీర్పును కోల్పోయిందన్నారు అఖిలేష్ యాదవ్. ఎన్నికైన ప్రభుత్వాల్ని కూల్చి వేయడం పనిగా పెట్టుకున్న బీజేపికి ఈ విజయం ఓ లెక్క కాదన్నారు ఎస్పీ చీఫ్.
Also Read : బీజేపీ నీచ రాజకీయాలకు చెంప దెబ్బ