NV Ramana : న్యాయ నిరాకరణ అరాచకానికి మార్గం – సీజేఐ
జస్టిస్ ఎన్వీ రమణ సంచలన కామెంట్స్
NV Ramana : భారత దేశ సర్వోన్నత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ నూతలపాటి వెంకట రమణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. న్యాయాన్ని తిరస్కరిస్తే అది అరాచకానికి దారి తీస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలో హక్కుల తీర్పు, రాజ్యాంగం ఆకాంక్షలను సమర్థించడం రాజ్యాంగ పరమైన బాధ్యత అని స్పష్టం చేశారు.
ఆరోగ్య కరమైన ప్రజాస్వామ్యానికి ప్రజలు తమ హక్కులు, గౌరవాన్ని గుర్తించి రక్షించ బడుతున్నామని భావించడం అత్యవసరమని ఆయన అభిప్రాయ పడ్డారు.
అంతిమంగా న్యాయ నిరాకరణ అన్నది చివరకు అరాచకానికి దారి తీస్తుందని పేర్కొన్నారు. శ్రీనగర్ లో జరిగిన కార్యక్రమంలో సీజేఐ ప్రసంగించారు.
న్యాయమూర్తులపై ఎన్నడూ లేనంతగా ఒత్తిడి ఉందన్నారు. ఈ దేశంలో న్యాయ బట్వాడా యంత్రాంగం చాలా సంక్లిష్టమైనది, ఖరీదైనదని వెల్లడించారు.
కోర్టులను కలుపుకొని అందుబాటులో ఉండేలా చేయడంలో దేశం చాలా వెనుకబడి ఉందని జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana)
విచారం వ్యక్తం చేశారు. వివాదాలను త్వరగా పరిష్కరించడం ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యం ప్రధాన లక్షణమని స్పష్టం చేశారు.
న్యాయాన్ని తిరస్కరించడం అంతిమంగా అరాచకత్వానికి దారి తీస్తుంది. త్వరలో న్యాయ వ్యవస్థ సంస్థ అస్థిరమవుతుంది. ప్రజలు చట్ట విరుద్దమైన యంత్రాంగాల కోసం చూస్తారని హెచ్చరించారు.
ఎదురయ్యే సవాళ్లను సమర్థవంతగా పరిష్కరించేందుకు న్యాయ వ్యవస్థ వినూత్నంగా ఉండాలని అభిప్రాయపడ్డారు జస్టిస్ ఎన్వీ రమణ(NV Ramana). జమ్మూ కాశ్మీర్ లో నూతన హైకోర్టు సముదాయానికి శంకుస్థాపన చేశారు.
జిల్లా న్యాయ వ్యవస్థే న్యాయ వ్యవస్థకు పునాది అని పేర్కొన్నారు రమణ. పునాది బలంగా ఉంటేనే మొత్తం వ్యవస్థ అభివృద్ధి చెందుతుందన్నారు.
దేశ వ్యాప్తంగా న్యాయపరమైన మౌలిక సదుపాయాల పరిస్థితి సంతృప్తికరంగా లేదన్నారు.
ప్రముఖ కవి అలీ జవాద్ జైదీ రాసిన ప్రసిద్ద పద్యాన్ని చదివి వినిపించారు. నేను యుగాల తర్వాత ఈ లోయకు వచ్చాను. నేను కొత్త అందాన్ని, కొత్త రంగును చూడగలను.
నేను ఈ స్వర్గాన్ని చాలా సార్లు సందర్శించే అదృష్టం కలిగి ఉన్నాను. కానీ ప్రతిసారీ నేను దాని అందాన్ని చూసి ఆశ్చర్య పోయాను, దాని ఆతిథ్యానికి కదిలి పోయాను.
నాలుగు రుతువులను అనుభవించే భూమి ఇది. ఈ సుందరమైన భూమిని సందర్శించే ప్రతి ఆత్మను మారుస్తుంది అని వినిపించారు.
Also Read : త్రిపుర సీఎంగా మాణిక్ సాహా