Devendra Fadnavis : ఆదిపురుష్ టీమ్ కు విషెస్ – ఫడ్నవీస్
సక్సెస్ కావాలని కోరిన డిప్యూటీ సీఎం
Devendra Fadnavis : ఓం రౌత్ దర్శకత్వంలో పాన్ ఇండియా హీరో ప్రభాస్ , ముద్దుగుమ్మ కృతీ సనన్ కలిసి నటించిన ఆదిపురుష్ జూన్ 16న శుక్రవారం ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. ఇప్పటి వరకు రూ. 30 కోట్లకు పైగా టికెట్లు అమ్ముడు పోయినట్లు సమాచారం. రామాయణంలోని ఇతివృత్తాన్ని ఆధారంగా చేసుకుని దర్శకుడు ఓం రౌత్ సినిమా తీశారు. వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు సినిమా విజయంతం కావాలని కోరారు.
గురువారం సామాజిక మాధ్యమాల వేదికగా ఆది పురుష్ చిత్రంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis). ఈ మేరకు సినిమా ఘన విజయాన్ని సాధించాలని టీమ్ కు అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ హల్ చల్ చేస్తున్నాయి. శ్రీరాముడు ఆదర్శ ప్రాయమైన పురుషుడు. ప్రభువు శ్రీరాముడి జీవితం ఆధారంగా తీసిన ఈ చిత్రం కోసం కోట్లాది మంది జనం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని పేర్కొన్నారు ఫడ్నవీస్.
ఆదిపురుష్ చార్ట్ బస్టర్ సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఇదిలా ఉండగా ఆదిపురుష్ స్క్రిప్ట్ రైటర్ మనోజ్ ముంతాషీర్ హర్యానా సీఎం ఖట్టర్ ను కలుసుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందించారు. ఆది పురుష్ విజయవంతం కావాలని కోరారు.
Also Read : Brij Bhushan Sharan Singh : డబ్ల్యూఎఫ్ఐ చీఫ్ పై నివేదిక సిద్దం