Deputy CM Pawan : పూర్తి మార్పులు చేర్పులతో అటవీశాఖను ముందుకు తీసుకువెళ్లాలి
.ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు...
Deputy CM Pawan : అటవీ శాఖలో దీర్ఘకాలంగా ఉన్న సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై సత్వరమే నివేదిక సిద్ధం చేయాలని ఉపముఖ్యమంత్రి, ఆ శాఖ మంత్రి పవన్‌కల్యాణ్(Deputy CM Pawan) గురువారం అధికారులను ఆదేశించారు. సమర్థత కలిగిన అధికార యంత్రాంగం ఉన్నా.. గత కొన్నేళ్లుగా అటవీ శాఖ సరైన ప్రగతి, మంచి ఫలితాలు సాధించలేకపోయిందని ఆయన గుర్తించారు. ఈ నేపథ్యంలో సమస్యలను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉందని అధికారులకు స్పష్టం చేశారు.ప్రాధాన్యత అంశాలపై దృష్టి పెట్టాలని నిర్దేశించారు.
దశల వారీగా పూర్తి స్థాయి మార్పులు, చేర్పులతో అటవీ శాఖను ముందు వరుసలో నిలిపేలా పని చేయాలని పీసీసీఎఫ్, హెచ్‌వోఎ్‌ఫఎ్‌ఫలను ఆదేశించారు. నూతనోత్తేజంతో, అద్భుత ప్రగతితో అటవీ శాఖ పచ్చగా కళకళలాడాలని సూచించారు. సిబ్బంది కొరత అంశాన్ని సీఎం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అటవీ భూముల పరిరక్షణకు తొలి ప్రాధాన్యం ఇవ్వాలని, భవిష్యత్తు అవసరాలకు ఉపయోగపడేలా భూములకు కంచెలు వేసి, పరిరక్షించేందుకు ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని ఆదేశించారు. ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు రాష్ట్ర సరిహద్దుల్లో నిఘా పటిష్ఠం చేసేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు.
Deputy CM Pawan Comments
అడవుల్లో అరుదుగా లభించే నాణ్యమైన, మేలైన ఉత్పత్తుల నుంచి ఆదాయం పెంపుదలకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని, గిరిజనులను భాగస్వామ్యం చేసి, ఉత్పత్తుల మార్కెటింగ్‌కు కార్పొరేట్ సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. ఆదాయమిచ్చే అరుదైన జాతుల మొక్కలను విరివిగా పంపిణీ చేయాలన్నారు. రాష్ట్రం 50 శాతం పచ్చదనం సాధించే దిశగా ముందుకు వెళ్లాలని, నగర వనాలు, ఎకో టూరిజం అభివృద్ధికి, కలప ఉత్పత్తికి పెంపుదలకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ దిశానిర్దేశం చేశారు.
Also Read : Ex Minister Talasani : పొలిసు అధికారులపై మాజీ మంత్రి సీరియస్