Deputy CM Pawan : ఏపీ డిప్యూటీ సీఎం కి ఉరటనిచ్చిన గుంటూరు కోర్టు
కేసు విచారణలో భాగంగా వాలంటీర్లు జరిగిన విషయం ఏంటో తెలిపారు...
Deputy CM Pawan : ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు గుంటూరు కోర్టులో ఊరట కలిగింది.వాలంటీర్లపై గత ఏడాది పవన్ కల్యాణ్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే. అసాంఘిక శక్తులుగా మారారని పవన్ వ్యాఖ్యానించగా కేసు నమోదైంది. అప్పటి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అజయ్ కుమార్ జైన్ ఆదేశాలతో పబ్లిక్ ప్రాసిక్యూటర్ కేసు ఫైల్ చేశారు. దాంతో పవన్ కల్యాణ్‌పై సెక్షన్ 499, సెక్షన్ 500 కింద కేసు నమోదైంది.
Deputy CM Pawan Kalyan..
పవన్కల్యాణ్‌పై నమోదైన కేసు గుంటూరు స్పెషల్ కోర్టుకు బదిలీ అయ్యింది, వాలంటీర్లపై కామెంట్లకు సంబంధించి పవన్ కల్యాణ్‌కు నోటీసులు కూడా జారీచేశారు. కేసు విచారణలో భాగంగా వాలంటీర్లు జరిగిన విషయం ఏంటో తెలిపారు. పవన్ కల్యాణ్‌పై ఫిర్యాదు చేయలేదని తెలిపారు. తమ పరువుకు భంగం కలిగేలా పవన్ మాట్లాడలేదని వివరించారు. వాలంటీర్ల సమాధానం విన్న స్పెషల్ కోర్టు ధర్మాసనం.. పవన్ కల్యాణ్‌పై నమోదైన కేసును డిస్మిస్ చేసింది. ఈ మేరకు స్పెషల్ కోర్టు న్యాయమూర్తి ఆర్ శరత్ బాబు ఉత్తర్వులు జారీ చేశారు. దాంతో వాలంటీర్లపై కామెంట్ల కేసులో పవన్ కల్యాణ్‌కు ఊరట కలిగింది.
Also Read : Vallabhaneni Vamsi : వల్లభనేని వంశీకి ఊహించని షాక్ ఇచ్చిన గన్నవరం పోలీసులు