Rasamai Balakishan : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలలో ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. ఇవాళ సమావేశం ప్రారంభం కాగానే డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ ప్రశ్నోత్తరాలను ప్రారంభించారు.
ఈ క్రమంలో పద్మారావు గౌడ్ కు అధికార పార్టీకి చెందిన రసమయి బాలకిషన్(Rasamai Balakishan) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. దీంతో సభలో ఉన్న టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మంత్రులు విస్తు పోయారు.
ప్రశ్నోత్తరాలలో భాగంగా ఎమ్మెల్యే రసమయి మాట్లాడుతుండగానే , ప్రశ్నలు సంధిస్తుండగానే డిప్యూటీ స్పీకర్ మైక్ ను కట్ చేశారు. ఆయనను పక్కన పెట్టి ఎమ్మెల్యే గొంగడి సునీతకు మాట్లాడే ఛాన్స్ ఇచ్చారు.
దీనిపై తీవ్ర స్థాయిలో అభ్యంతరం తెలిపారు రసమయి బాలకిషన్. మాట్లాడేందుకు అవకాశం ఇవ్వక పోతే ఎలా అని ప్రశ్నించారు.
తాను వేరే సబ్జెక్టు మాట్లాడలేదని, తన నియోజకవర్గానికి సంబంధించిన అంశాలు, సమస్యల గురించి మాత్రమే మంత్రిని ఉద్దేశించి ప్రశ్నించానని అన్నారు బాలకిషన్. డిప్యూటీ స్పీకర్ వ్యవహారంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.
సభలో మాట్లాడదామని అనుకుంటే అవకాశం రావడం లేదన్నారు. కనీసం ప్రశ్నలు అడిగే ఛాన్స్ కూడా రాకుండా అడ్డుకుంటే ఎలా అని, ఇంక ఇక్కడ ఎందుకు ఉండాలని గమ్మున ఉండి పోయారు.
తమకు ప్రశ్నలు ఎందుకు ఇచ్చారంటూ నిలదీశారు. ప్రస్తుతం డిప్యూటీ స్పీకర్ పద్మారావు గౌడ్ వర్సెస్ బాలకిషన్ మధ్య వాగ్వాదం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఇద్దరి మధ్య నెలకొన్న వైరల్ అవుతోంది.
డిప్యూటీ స్పీకర్ జోక్యం చేసుకుంటూ ఒక్కొక్కరు గంటల తరబడి మాట్లాడితే కష్టం అవుతుందన్నారు.
Also Read : రవిప్రకాష్‌పై చర్యలు తీసుకోండి