Derek Chollet : పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ లో అమెరికా చీఫ్ జోసెఫ్ బైడెన్ డెమోక్రటిక్ పార్టీకి చెందిన సోమాలియా, అమెరికన్ అయిన ఇల్హాన్ ఒమర్ పర్యటించడాన్ని తీవ్రంగా తప్పు పట్టింది భారత్. ఎవరి పరిమితులు వారుంటే బెటర్ అని పేర్కొంది.
ఇది పూర్తిగా విదేశాంగ విధానానికి వ్యతిరేకమని స్పష్టం చేసింది. సీరియస్ వార్నింగ్ ఇచ్చింది అమెరికాకు. ఈనెల 20 నుంచి 24 వరకు పాకిస్తాన్ లో పర్యటించడాన్ని తప్పు పట్టింది.
ఆ దేశంలో పర్యటిస్తే తప్పు లేదని కానీ పీఓకేలో పర్యటించడాన్ని సీరియస్ గా తీసుకుంది. తమ ఆంతరంగిక అంశాలలో ఏ ఇతర దేశపు జోక్యాన్ని సహించే ప్రసక్తి లేదంటూ వార్నింగ్ ఇచ్చింది.
ఇది పూర్తిగా అమెరికా, ఇండియా దేశాల మధ్య ఒప్పందం లేదని పేర్కొంది. తన పర్యటనలో భాగంగా పాకిస్తాన్ మాజీ ప్రధాన మంత్రి ఇమ్రాన్ ఖాన్ , ప్రస్తుత ప్రధాని షెహబాజ్ అహ్మద్ తో భేటీ అయ్యింది.
అనంతరం జమ్మూ కాశ్మీర్ గురించి నోరు పారేసుకుంది. దీంతో భారత విదేశాంగ శాఖ మండిపడింది. దీనిపై వెంటనే స్పందించింది అమెరికా. ఇది తమ దేశపు తరపు నుంచి ఇల్హాన్ ఒమర్ అధికారికంగా పర్యటించ లేదని స్పష్టం చేసింది.
దీనిపై తాము తీవ్రంగా బాధను వ్యక్తం చేస్తున్నట్లు యుఎస్ సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఆంటోనీ బ్లింకెన్ సలహాదారు డెరెక్ చొల్లెట్(Derek Chollet )తెలిపారు.
Also Read : శ్రీలంకకు సాయంపై భారత్ కు ప్రశంస