Derek O Brien : మోదీ నోట్ల ర‌ద్దుపై టీఎంసీ ఫైర్

ఆర్బీఐ తాజా వార్షిక నివేదిక ప్ర‌స్తావ‌న

Derek O Brien : ప్ర‌ధాన మంత్రి నరేంద్ర మోదీ తీసుకున్న‌ నోట్ల ర‌ద్దు నిర్ణ‌యం దేశానికి మేలు కంటే ఎక్కువ‌గా న‌ష్టం చేకూర్చిందంటూ ఆర్బీఐ సంచ‌ల‌న నివేదిక వెల్ల‌డించింది.

దీనిని ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావిస్తూ తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ డెరెక్ ఓబ్రియ‌న్(Derek O Brien) తీవ్రంగా మండి ప‌డ్డారు ప్ర‌ధానిపై. ఈ ఏడాది, గ‌త సంవ‌త్స‌రం మ‌ధ్య న‌కిలీ రూ. 500 నోట్ల సంఖ్య‌ను రెట్టింపుగా చూపించే గ్రాఫిక్ ను షేర్ చేశారు.

ఈ మేర‌కు ఆయ‌న చేసిన ట్వీట్ క‌ల‌క‌లం రేపుతోంది. ఆర్బీఐ వార్షిక నివేదిక లోని న‌కిలీ క‌రెన్సీ నోట్ల డేటాను ఎత్తి చూపారు.

నోట్ల ర‌ద్దు డిజిట‌ల్ లావాదేవీల‌ను పురికొల్పుతుంద‌ని, న‌కిలీ క‌రెన్సీని తుడిచి పెడుతుందంటూ ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ చేసిన ప్ర‌క‌ట‌న‌ను తీవ్రంగా

త‌ప్పు ప‌ట్టారు టీఎంసీ నేత డెరెక్ ఓబ్రియిన్(Derek O Brien).

ఇదే స‌మ‌యంలో న‌కిలీ రూ. 2000 నోట్ల సంఖ్య 54 శాతం పెరిగింద‌ని తాను చెప్ప‌డం లేద‌ని ఆర్బీఐ వెల్ల‌డించిన నివేదిక‌లో స్ప‌ష్టం చేసింద‌ని పేర్కొన్నారు. ఈ సంద‌ర్బంగా మోదీని ఉద్దేశించి ఎద్దేవా చేశారు.

న‌మ‌స్తే మోదీజీ. మీకు నోట్ల ర‌ద్దు గుర్తుందా. దేశానికి డెమో ఎలా హామీ ఇచ్చారు. అన్ని న‌కిలీ క‌రెన్సీని తుడిచి వేస్తానంటూ ప్ర‌గ‌ల్భాలు ప‌లికారు.

మ‌రి మీరు ఇన్నేళ్ల పాటు ఏం చేశారు. ఇదిగో ప్ర‌భుత్వ ఆర్బీఐ నివేదిక మీ హామీల‌కు విరుద్దంగా ఉందంటూ స్ప‌ష్టం చేశారు.

గ‌త ఏడాది తో పోల్చితే రూ. 10, రూ. 10, రూ. 200 డినామినేష‌న్ల‌లో గుర్తించిన న‌కిలీ నోట్ల‌లో 16.4 శాతం, 16.5 శాతం, 11.7 శాతం , 101.9 శాతం , 54.6 శాతం పెరుగుద‌ల న‌మోదైంది.

500 కొత్త డిజైన్ చేసిన వాటితో పాటు రూ. 2000, రూ. 50 , రూ. 100 డినామినేష‌న్ లో క‌నుగొన్న న‌కిలీ నోట్లు వ‌రుస‌గా 28. 7 శాతం 16.7 శాతం త‌గ్గాయ‌ని నివేదిక పేర్కొంద‌ని తెలిపారు.

Also Read : ఇండిగో ఎయిర్ లైన్స్ కు రూ. 5 ల‌క్ష‌ల ఫైన్

Leave A Reply

Your Email Id will not be published!