Google AI Journalists : జర్నలిస్టుల కోసం గూగుల్ ఏఐ
కంటెంట్ క్రియేషన్ లో సపోర్ట్
Google AI Journalists : ప్రపంచంలో ఏం జరుగుతుందో ఎప్పటికప్పుడు సమాచారాన్ని అందించడంలో అహోరాత్రులు శ్రమిస్తున్న జర్నలిస్టులకు తీపికబురు చెప్పింది ప్రపంచ టెక్ దిగ్గజ కంపెనీ గూగుల్(Google AI Journalists). ప్రస్తుతం ప్రత్యేకించి ప్రింట్, ఎలక్ట్రానిక్ , డిజిటల్ మీడియాలలో పని చేసే వారి కోసం త్వరలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధనాలను తీసుకు వస్తున్నట్లు ప్రకటించింది.
Google AI Journalists Update
ఇది ప్రత్యేకించి స్పెషల్, ఇన్వెస్టిగేటివ్ కథనాలను రాసేందుకు మరింత ఉపయోగ పడుతుందని పేర్కొంది గూగుల్. పని , ఉత్పాదకతను పెంపొందించడంలో సహాయకారిగా ఉంటుందని పేర్కొంది. ముఖ్యాంశాలు, టాప్ స్టోరీస్ , బ్రేకింగ్ , ఇన్వెస్టిగేటివ్ కథనాలను రాయడంలో ఈ టూల్స్ ఉపయోగ పడతాయని తెలిపింది గూగుల్.
ఇందుకు సంబంధించి పేరు పొందిన మీడియా సంస్థలతో గూగుల్ చర్చలు జరుపుతోందని సంస్థ ప్రతినిధి ఒకరు వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందిన వాషింగ్టన్ పోస్ట్ , వాల్ స్ట్రీట్ జర్నల్ – ఓవర్ న్యూస్ కార్ప్ , న్యూయార్క్ టైమ్స్ తో గూగుల్ చర్చలు జరిపిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కూడా ధ్రువీకరించింది.
ఇదిలా ఉండగా పుస్తకాల నుండి కంటెంట్ ను చోరీ చేయడం మానుకోవాలని రచయితలు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంపెనీలను కోరారు. మరో వైపు ఏఐ లోని సవాళ్లను పరిష్కరించేందుకు మెటా ఏఐ పరిశోధన సంస్థను ఏర్పాటు చేసింది.
Also Read : Amit Malviya : దీదీ పాలనలో రక్షణ కరువు – మాల్వియా