CM YS Jagan : వికేంద్రీక‌ర‌ణ‌తోనే అభివృద్ది సాధ్యం – జ‌గ‌న్

నా దృష్టిలో అన్ని ప్రాంతాలు స‌మానం

CM YS Jagan : ఆంధ్ర ప్ర‌దేశ్ రాష్ట్ర ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. వికేంద్రీక‌ర‌ణ‌తోనే అభివృద్ది సాధ్య‌మ‌వుతుంద‌న్నారు సీఎం.

ప్ర‌తిప‌క్షాలు ఆరోప‌ణ‌లు చేస్తున్న‌ట్లు త‌న‌కు ఒక్క ప్రాంతంపైనే ప్రేమ లేద‌న్నారు. అన్ని ప్రాంతాలు త‌న‌కు ఒక్క‌టేన‌ని స్ప‌ష్టం చేశారు. ఇందులో ఎలాంటి అనుమానం అక్క‌ర్లేద‌న్నారు జ‌గ‌న్ రెడ్డి(CM YS Jagan).

రాష్ట్రంలో అతి పెద్ద న‌గ‌రంగా విశాఖ ప‌ట్ట‌ణం కావ‌చ్చ‌ని తెలిపారు. ప్ర‌తిప‌క్షాలు ప‌నిగ‌ట్టుకుని ఆధారాలు లేకుండా ఆరోప‌ణ‌లు చేస్తున్నాయ‌ని మండిప‌డ్డారు.

రోజుకో మాట మాట్లాడే వారిని జ‌నం న‌మ్మ‌ర‌న్నారు జ‌గ‌న్ రెడ్డి. అసెంబ్లీ సాక్షిగా సీఎం ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. త‌మ‌కు అభివృద్దే ముఖ్య‌మ‌ని స్ప‌ష్టం చేశారు.

త‌న‌కు రాజ‌కీయాలు తెలియ‌వ‌న్నారు. ప్ర‌జా సంక్షేమం కోసం తాను కృషి చేస్తున్నాన‌ని అన్ని వ‌ర్గాల‌కు న్యాయం జ‌రిగేలా సంక్షేమ ప‌థ‌కాలు, కార్య‌క్ర‌మాల‌ను అమ‌లు చేస్తున్నామ‌ని చెప్పారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి.

రూ. 10,000 కోట్ల పెట్టుబ‌డితో స‌హ‌జ రాజ‌ధాని న‌గ‌రంగా వైజాగ్ రూపు దిద్దు కోనుంద‌న్నారు. గ‌తంలో వేసిన అంచ‌నా కంటే ప‌ది శాతం త‌క్కువేన‌ని పేర్కొన్నారు సీఎం.

53 వేల ఎక‌రాల భూమికి మౌలిక స‌దుపాయాల కోసం 1.10 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చ‌వుతుంద‌ని అప్ప‌టి సీఎం చంద్ర‌బాబు నాయుడు అంచనా వేశార‌ని చెప్పారు.

ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వ‌ర్గాల‌ను ఏనాడూ ఆదుకున్న పాపాన పోలేద‌న్నారు. స‌మాజంలోని ఒక వ‌ర్గం కోస‌మే ఆయ‌న ప‌ని చేశార‌ని మండిప‌డ్డారు జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి(CM YS Jagan).

బాబు మోసాల‌ను గుర్తించినందుకే త‌మ‌కు అఖండ మెజారిటీ క‌ట్ట‌బెట్టార‌ని చెప్పారు సీఎం.

Also Read : లిస్టింగ్ సిస్టంపై సుప్రీం బెంచ్ అసంతృప్తి

Leave A Reply

Your Email Id will not be published!