Devendra Fadnavis : ఆధారాల మేరకే సంజయ్ రౌత్ అరెస్ట్
ఎలాంటి రాజకీయ దురద్దేశం లేదు
Devendra Fadnavis : శివసేన అగ్ర నాయకుడు సంజయ్ రౌత్ ను ఈడీ అరెస్ట్ చేయడంపై స్పందించారు బీజేపీ చీఫ్, మహారాష్ట్ర డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
ఎలాంటి రాజకీయ దురుద్దేశం లేదని ప్రకటించారు. తమపై చేస్తున్న ఆరోపణలన్నీ అవాస్తవాలని పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆధారాలు ఉండడంతోనే సంజయ్ రౌత్ ను అదుపులోకి తీసుకున్నారని, కస్టడీకి తీసుకున్నారని చెప్పారు ఫడ్నవీస్.
రాజకీయాలు వేరు అరెస్ట్ లు వేరన్నారు. సంజయ్ రౌత్ కేంద్రాన్ని, తమను టార్గెట్ చేస్తూ వచ్చారని కానీ ఏనాడూ తాము ఆయన పట్ల వ్యతిరేకత కనబర్చిన దాఖలాలు లేవన్నారు. దక్షిణ ముంబై లోని మంత్రాలయంలో జరిగిన సమీక్షా సమావేశానికి హాజరయ్యారు.
అనంతరం మాట్లాడుతూ సంజయ్ రౌత్ అరెస్ట్ పై షాకింగ్ కామెంట్స్ చేశారు. కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఒకరు చెబితే పని చేయదు. దానికంటూ ఓ సిస్టం ఉంది.
ఎలాంటి ఆధారాలు, సాక్ష్యాలు లేకుండా రంగంలోకి దిగదు. పక్కాగా చూసుకున్న తర్వాత బేరీజు వేసుకున్న తర్వాత ఎంట్రీ ఇస్తుంది.
ఇక సంజయ్ రౌత్ విషయంలో ఈడీ వద్ద బలమైన ఆధారాలు ఉండడం వల్లనే రంగంలోకి దిగిందన్నారు దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis). ఆయన అరెస్ట్ వ్యవహారం కోర్టు పరిధిలో ఉంది.
దాని గురించి కామెంట్స్ చేయడం మంచిది కాదన్నారు డిప్యూటీ సీఎం. ఇదిలా ఉండగా తనపై వచ్చిన ఆరోపణలను ఖండించారు సంజయ్ రౌత్. అవి పూర్తిగా అబద్దమని , రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగమే తన అరెస్ట్ అని స్పష్టం చేశారు.
Also Read : నాలుగు రోజుల ఈడీ కస్టడీకి సంజయ్ రౌత్