Devendra Fadnavis : మరాఠాపై బీజేపీ జెండా ఎగరేస్తాం
ప్రకటించిన మాజీ సీఎం ఫడ్నవిస్
Devendra Fadnavis : భారతీయ జనతా పార్టీ, శివసేన పార్టీల మధ్య మాటల యుద్దం మరింత ముదిరి పాకాన పడింది. ఇటీవలే శివసేన పార్టీ బహిరంగ సభలో ఆ పార్టీ చీఫ్, మరాఠా సీఎం ఉద్దవ్ ఠాక్రే బీజేపీపై నిప్పులు చెరిగారు. సంచలన కామెంట్స్ చేశారు.
బీజేపీ నేతలను గాడిదలతో పోల్చారు. ఆ పార్టీతో 25 ఏళ్ల పొత్తు కారణంగా తాము ఎంతో నష్ట పోయామన్నారు. దీనికి స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు బీజేపీ చీఫ్, మాజీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ (Devendra Fadnavis).
ముంబైలో జరిగిన పార్టీ మహా సంకల్ప్ సభలో ఆయన బీజేపీ కార్యకర్తలతో కలిసి హనుమాన్ చాలీసా పఠించారు. ఈ సందర్బంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఉద్దవ్ ఠాక్రే నేతృత్వంలోని ప్రభుత్వాన్ని టార్గెట్ చేశారు.
మహా వికాస్ అఘాడి ప్రభుత్వాన్ని బాబ్రీ తరహా నిర్మాణంతో పోల్చారు. దానిని కూల్చేంత దాకా తాను నిద్ర పోనని శపథం చేశారు. తాము ఇప్పుడే చాలీసా పఠించాం.
బాలా సాహెబ్ ఠాక్రే తన తనయుడు సీఎంగా కొలువు తీరిన సమయంలో హనుమాన్ చాలీసా చదవడం దేశ ద్రోహమని , ఔరంగా జేబు సమాధిని సందర్శించడం రాష్ట్ర మర్యాదా అని ఎప్పుడైనా భావించారా అని ప్రశ్నించారు దేవేంద్ర ఫడ్నవీస్(Devendra Fadnavis).
వారు ఆదివారం ఓ ర్యాలీని చేపట్టారు. దానిని వారు మాస్టర్ సభ అని పేర్కొన్నారు. కానీ ఆ ర్యాలీని చూస్తుంటే ఆ సభ మాకు నవ్వు తెప్పించిందన్నారు.
వారు నిర్వహించన సభను కౌరవ సభగా పోల్చారు ఫడ్నవీస్. తాము చేపట్టిన ఈ సభ పాండవ సభగా అభివర్ణించారు. కాగా ఫడ్నవీస్ చేసిన కామెంట్స్ కలకలం రేపాయి.
Also Read : ప్రజలతో దూరం పార్టీకి శాపం