Statue Of Equality : భక్తులతో పులకించి పోతోంది రంగారెడ్డి జిల్లాలోని ముచ్చింతల్ లో ఏర్పాటు చేసిన శ్రీరామనగరం. ఆధ్యాత్మికతతో అలరిస్తోంది. ఇక్కడ ఏర్పాటు చేసిన ఆశ్రమం ఎందరికో నీడ నిస్తోంది. మరెందరికో స్పూర్తిని కలిగిస్తోంది.
కొన్నేళ్లుగా జై శ్రీమన్నారాయణ అనే పదం నినాదమై మోగుతోంది. ఎటు చూసినా భక్తులే. ఎక్కడ చూసినా ఆధ్యాత్మికత ఉట్టి పడిన ఆనవాళ్లే. వేలాది మంది భక్తులు దేశం నలు చెరుగుల నుంచి ఇక్కడికి విచ్చేశారు.
ప్రపంచంలోనే రెండోవదిగా దేశానికే తలమానికంగా తెలంగాణ రాష్ట్రానికే గర్వ కారణంగా నిలిచేలా ఈ ప్రాంగణంలోనే శ్రీ రామానుజుడి విగ్రహం (Statue Of Equality)కొలువు తీరింది.
దానికి జగత్ గురువు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చినజీయర్ స్వామి వారు సమతామూర్తి కేంద్రం అని పేరు పెట్టారు. ఇపుడు స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ అన్న పేరు దేశమంతటా మారు మోగుతోంది.
యాగశాలలు వేదమంత్రాలతో దద్దరిల్లుతోంది శ్రీరామనగరం(Statue Of Equality) ప్రాంగణం. వేలాది మంది భక్తులు, రుత్వికులు, పండితులు, ప్రముఖులు ఎంత మంది వచ్చినా ఏ ఒక్కరికీ ఇబ్బంది లేకుండా ఏర్పాట్లు చేశారు.
వెయ్యేళ్ల కిందట కుల, మతాలు ఉండ రాదని చాటి చెప్పిన ఆ మహనీయుడు శ్రీ రామానుజుల వారిని నేటి తరాలకు స్పూర్తి దాయకుండా ఉండేందుకే విగ్రహాన్ని ఏర్పాటు చేసినట్లు శ్రీశ్రీశ్రీ త్రిదండి రామానుజ చిన్నజీయర్ స్వామి స్పష్టం చేశారు.
పరివర్తన అన్నది ముఖ్యమని, అది లేక పోతే జీవితం వ్యర్థమని అంటారు. ఇదిలా ఉండగా శ్రీరామ నగరంలో జరుగుతున్న మహోత్సవ కార్యక్రమాలలో పాలు పంచుకున్నారు తెలంగాణ సీఎం కేసీఆర్.
ఈ సందర్భంగా జరుగుతున్న ఏర్పాట్లు తెలుసుకున్నారు.
Also Read : సమతామూర్తి కేంద్రం పహారామయం