Dwaraka Tirumala : కోరిన కోర్కెలు తీరుస్తాడని కొందరు. మనశ్శాంతి లభిస్తుందని మరికొందరు ఇలా వేలాది మంది భక్తులు తిరుమలతో పాటు ద్వారకా తిరుమలను దర్శించు కోవడం ఆనవాయితీగా వస్తోంది.
ఈ దేశంలో దేవాలయాలకు కొదువ లేదు. కానీ ఎన్నో అష్టకష్టాలు పడి తిరుమలకు చేరుకుంటే దర్శన భాగ్యం కలగడం లేదన్న ఆరోపణలు ఈ మధ్య మరీ ఎక్కువై పోయాయి.
కరోనా తగ్గుముఖం పట్టడంతో మాస్కులు పెట్టుకోకుండానే భక్తులు బారులు తీరుతున్నారు. గతంలో తిరుమల శ్రీవారి ప్రసాదం అంటే ఎంతో గౌరవం, భక్తి ఉండేది. దానికి అద్భుతమైన రుచి ఉండేది.
కానీ ఆ రుచి, ఆ మాధుర్యం లేదని భక్తులు వాపోతున్నారు. ఇక తాజాగా శనివారం ద్వారకా తిరుమల(Dwaraka Tirumala )వద్ద భక్తులు తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలకే స్వామి వారి దర్శనం కలిపిస్తుండడంపై మండిపడ్డారు.
సామాన్యులమైన తమకు ఎందుకు దర్శనం కల్పించడం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వీఐపీలు వస్తున్నారంటూ గంటకు పైగా క్యూ లైన్లను నిలిపి వేశారు.
దీంతో భక్తులు తీవ్ర స్థాయిలో ఫైర్ అయ్యారు. దేవస్థానంలో జరిగే పలు ప్రారంభోత్సవాలను పురస్కరించుకుని ముందుగా విచ్చేశారు టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి, దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్. వీరిని ఏకి పారేశారు భక్తులు.
నచ్చ చెప్పేందుకు ప్రయత్నం చేశారు. ఎంతకూ వినక పోవడంతో వారిని సైతం విడిచి పెట్టారు. దీంతో గందరగోళం సద్దు మణిగింది. మొత్తంగా టీటీడీ ఏం చేస్తుందో ఎవరికీ అర్థం కావడం లేదంటున్నారు భక్తులు.
Also Read : కోట్లల్లో ఆదాయం సౌకర్యాలు శూన్యం