Tirumala: తిరుమల క్యూలైన్ లలో ఆకతాయిల ప్రాంక్ వీడియో ! దర్యాప్తుకు ఆదేశం !
తిరుమల క్యూలైన్ లలో ఆకతాయిల ప్రాంక్ వీడియో ! దర్యాప్తుకు ఆదేశం !
Tirumala: తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం క్యూ లైన్లలో ఆకతాయిలు తీసిన ప్రాంక్ వీడియోలు పెను దుమారాన్ని రేపుతున్నాయి. శ్రీవారి దర్శనానికి వెళ్లే నారాయణగిరి ఉద్యానవన షెడ్లలో కొందరు ఆకతాయిలు ప్రాంక్ వీడియోలు తీసారు. తరువాత వాటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. దీనితో అవి కాస్తా వైరల్ గా మారడంతో టీటీడీ అధికారుల దీనిపై సీరియస్ గా స్పందించారు. ఈ ప్రాంక్ వీడియోలపై సమగ్ర విచారణకు టీటీడీ విజిలెన్స్ రంగంలోనికి దిగింది. ఇక పూర్తి వివరాల్లోకి వెళితే…
Tirumala Update
తమిళనాడు రాష్ట్రానికి చెందిన టీటీఎఫ్ వాసన్ తన మిత్రులతో కలిసి స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఈ క్రమంలో నారాయణగిరి షెడ్స్‌లోని క్యూలో వెళ్తూ… కంపార్ట్‌మెంట్ తాళాలు తీసేందుకు ప్రయత్నిస్తున్నట్టు నటించారు. వచ్చిన వారు తితిదే సిబ్బందిగా భావించిన భక్తులు ఒక్కసారిగా పైకి లేచి ఆశగా ఎదురు చూశారు. వెకిలిగా నవ్వుతూ వెంటనే అక్కడి నుంచి పరుగులు పెట్టారు. తీరా చూస్తే వారు ప్రాంక్ వీడియో చేశారు. ఈ సన్నివేశాన్ని చిత్రీకరించిన ఆ ఆకతాయిలు ఇన్‌స్టా గ్రామ్ లో పోస్ట్ చేశారు. ఈ వీడియోపై తమిళనాడులో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. సాధారణంగా నారాయణగిరి షెడ్స్ దాటి వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌కు ప్రవేశించక ముందే భక్తుల నుంచి సెల్‌ఫోన్లు డిపాజిట్ చేయిస్తారు.
నిత్యం భక్తుల గోవింద నామాలతో మారు మ్రోగే తిరుమల కంపార్ట్‌మెంట్లలో వారి మధ్యనే ఉండి ఒకరిద్దరు ఆకతాయిలు చేసిన ఈ వికృత చేష్టలపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పలువురు నెటిజన్లు టీటీడీ(Tirumala) దృష్టికి తీసుకెళ్లారు. ఈ వీడియోలపై టీటీడీ తీవ్రంగా స్పందించింది. భక్తుల మనోభావాలు దెబ్బ తీసేలా ప్రాంక్ వీడియోలు తీయడం హేయ మైన చర్య … అటువంటి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని టీటీడీ ప్రకటించింది. ఇది ఇలా ఉండగా… తిరుమల ఆలయంలో క్యూ లైన్లలోకి వెళ్లాలంటే సిబ్బంది ఎన్నో రకాలుగా చెకింగ్స్ చేసి పంపిస్తారు. భక్తుల వద్ద మొబైల్ ఫోన్లు ఉంటే వాటిని స్వాధీనం చేసుకుంటారు. కాగా, ఈ వీడియో చేసిన యువకులు ఆలయంలోకి ఫోన్ ఎలా తీసుకెళ్లారు? అనేది తెలియాల్సి ఉంది.
Also Read : Mallu Bhatti Vikramarka: తెలంగాణాలో మైనింగ్ సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు !