Tirumala Rush : పోటెత్తిన భక్తులు దర్శనానికి తిప్పలు
జన సందోహంతో తిరుమల గిరులు కిటకిట
Tirumala Rush : తిరుమల భక్తులతో పోటెత్తుతోంది. ఆ దేవ దేవుడు, కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామిని దర్శించు కునేందుకు నానా తంటాలు పడుతున్నారు కరోనా తర్వాత రూల్స్ సడలించడంతో ఆశించిన దాని కంటే ఎక్కువ మంది భక్తులు క్యూ కట్టారు తిరుమలకు(Tirumala Rush). తిరుమల తిరుపతి దేవస్థానం ఎన్ని ఏర్పాట్లు చేసినా సరి పోవడం లేదు.
సుదూర ప్రాంతాల నుంచి స్వామి దర్శనం కోసం రావడంతో అన్ని కాంప్లెక్సులు నిండి పోతున్నాయి. దీంతో ఏడు కొండల స్వామిని దర్శనం చేసుకోవాలంటే నానా తిప్పలు పడాల్సి వస్తోంది. గంటల తరబడి ఒక్కోసారి రోజుల తరబడి నిరీక్షించాల్సి వస్తోంది. చాలా మంది భక్తులు క్యూ లైన్లలోనే గడుపుతున్నారు.
ఇక చంటి పిల్లల తల్లులు, వృద్దుల సంగతి చెప్పాల్సిన పని లేదు. ఓ వైపు శీతాకాలం, చలి పులి చంపుతోంది. ఇంకో వైపు స్వామి దర్శనం ఇబ్బందిగా మారింది. క్యూ కాంప్లెక్సులే కాదు కంపార్ట్ మెంట్లు సైతం నిండి పోతున్నాయి. కొండ పైన భక్తుల రద్దీతో నిండి పోతే కొండ కింద కూడా సేమ్ సీన్ రిపీట్ అవుతోంది.
ఇయర్ ఎండింగ్ కావడం, సెలవులు వస్తున్నాయంటే చాలు భక్తులు తిరుమల వైపు పరుగులు తీస్తున్నారు. గోవిందుడిని దర్శనం చేసుకోవాలంటే కనీసం 24 గంటలకు పైగా పడుతోంది. వీఐపీలకు కూడా గదులు దొరకని పరిస్థితి నెలకొనడంతో టీటీడీ నానా తంటాలు పడుతోంది ఏర్పాట్లు చేయలేక. తిరుమల, తిరుపతి, అలిపిరి ఇలా ప్రతిచోటా ఎక్కడ చూసినా భక్తులే కనిపిస్తున్నారు.
Also Read : కరోనా కలకలం కేంద్రం అప్రమత్తం