Dewald Brevis : ఐపీఎల్ 2022లో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. పంజాబ్ కింగ్స్ తో జరిగిన లీగ్ మ్యాచ్ లో ముంబై ఇండియన్స్ కు ప్రాతినిధ్యం వహిస్తున్న దక్షిణాఫ్రికా స్టార్ హిట్టర్ బేబీ ఏబీ అలియాస్ డెవాల్ట్ బ్రెవిస్(Dewald Brevis) ఆకాశమే హద్దుగా చెలరేగాడు.
శార్దూల్ బౌలింగ్ లో ఏకంగా వరుసగా నాలుగు సిక్సులతో విరుచుకు పడ్డాడు. కేవలం 25 బందులు ఆడిన ఈ క్రికెటర్ 49 పరుగులు చేశాడు. కనీసం ఐదు నిమిషాల సేపు క్రీజులో ఉండి ఉంటే మ్యాచ్ ముంబై ఇండియన్స్ వైపు వచ్చేది.
కానీ మ్యాచ్ ఓడి పోయినా బేబీ ఏబీ మాత్రం చర్చనీయాంశంగా మారాడు. ప్రముఖ వివాదాస్పద కామెంటేటర్ మైఖేల్ వాన్ అయితే ఏకంగా ఈ సఫారీ ఆటగాడిని ఏబీ అని ఎందుకు అంటారో ఈ ఆటను చూస్తే చెప్పవచ్చు.
ఏబీ డివిలియర్స్ అంటేనే విధ్వంసానికి మరోపేరు. అతడి తర్వాత డెవాల్ట్ బ్రెవిస్(Dewald Brevis) కు జూనియర్ ఏబీ అని పేరు వచ్చింది. మనోడి ఆట తీరు డివిలయర్స్ ను పోలి ఉంటుంది.
ఐసీసీ అండర్ -19 లో దుమ్ము రేపాడు. ఏకంగా భారీ పరుగులతో విరుచుకు పడ్డాడు. దీంతో బెంగళూరు వేదికగా జరిగిన ఐపీఎల్ మెగా వేలంలో భారీ ధరకు ముంబై ఇండియన్స్ ఈ స్టార్ ప్లేయర్ ను కైవసం చేసుకుంది.
బేబి ఏబీ కొట్టిన సిక్స్ ఒకటి 112 మీటర్ల దూరంలో పడింది. మనోడ్ స్టార్ ప్లేయరే కాదు బ్యాటర్ కమ్ లెగ్ స్పిన్నర్ కూడా. బంతుల్ని బౌండరీ లైన్లు దాటించగలడు.
అదే సమయంలో అద్భుతమైన బంతులతో వికెట్లను కూల్చగలిగే సత్తా ఉన్నోడు జూనియర్ బేబీ ఏబీ.
Also Read : రాజస్థాన్ గుజరాత్ నువ్వా నేనా