DGCA Notice : ఎయిర్ లైన్స్ ల‌కు డీజీసీఏ వార్నింగ్

ప్ర‌యాణికుల ప‌ట్ల జాగ్ర‌త్తంగా ఉండాలి

DGCA Warning : ఇటీవ‌ల ఎయిర్ లైన్స్ కు సంబంధించి అనుకోని సంఘ‌ట‌న‌లు చోటు చేసుకుంటున్నాయి. ఎయిర్ ఇండియా విమానంలో రెండు ఘ‌ట‌న‌లు చోటు చేసుకున్నాయి. ఇద్ద‌రు ప్ర‌యాణికుల‌పై మూత్ర విస‌ర్జ‌న చేసిన‌ట్లు ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. ఈ ఘ‌ట‌న‌కు సంబంధించి డీజీసీఏ ఎయిర్ ఇండియాకు నోటీసు(DGCA Notice) జారీ చేసింది.

మ‌రో వైపు వృద్దురాలిపై మూత్ర విస‌ర్జ‌న చేసిన శంక‌ర్ మిశ్రాపై కంపెనీ వేటు వేసింది. తాజాగా డీజీసీఏ కీల‌క ప్ర‌క‌ట‌న చేసింది. భార‌త దేశంలోని అన్ని ఎయిర్ లైన్స్ సంస్థ‌లు విధిగా రూల్స్ పాటించాల‌ని స్ప‌ష్టం చేసింది. ఈ మేర‌కు కొత్త‌గా మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

పైలట్లు, క్యాబిన్ సిబ్బంది, ఇన్ ఫ్లైట్ స‌ర్వీసుల డైరెక్ట‌ర్ల బాధ్య‌తలు ఏమిటో ఆయా సంస్థ‌లు విధిగా త‌ర్ఫీదు ఇవ్వాల‌ని, ఇక నుంచి ఏ ప్ర‌యాణికుడి నుంచి లేదా ఇత‌ర స‌మ‌స్య‌ల‌పై ఫిర్యాదులు వ‌స్తే తీవ్ర ప‌రిణామాలు ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని డీజీసీఏ హెచ్చ‌రించింది. మూత్ర విస‌ర్జ‌న ఘ‌ట‌న‌ల‌ను ప్ర‌త్యేకంగా ప్ర‌స్తావించింది.

ఇప్ప‌టికే ప‌లు నోటీసులు జారీ చేసింది. ఏవియేష‌న్ రెగ్యులేట‌ర్ డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ సివిల్ ఏవియేష‌న్ (డీజీసీఏ)(DGCA Notice) నియంత్ర‌ణ‌లో ఉంటాయి ఎయిర్ లైన్స్ లు అన్నీ. ఇది కేంద్ర ప్ర‌భుత్వానికి జ‌వాబుదారీగా ఉంటుంది. ఉద్యోగుల‌కు సంబంధించి ప్ర‌త్యేకంగా ప్ర‌యాణికుల ప‌ట్ల ఎలా వ్య‌వ‌హ‌రించాలో అనే దానిపై శిక్ష‌ణ ఇవ్వాల‌ని సూచించింది. ఆయా సంస్థ‌ల అధిప‌తుల‌కు.

ఈ మ‌ధ్య కాలంలో విమానంలో ప్ర‌యాణించే స‌మ‌యంలో ప్ర‌యాణికుల వికృత ప్ర‌వ‌ర్త‌నను గ‌మ‌నిస్తున్న‌ట్లు తెలిపింది డీజీసీఏ.

Also Read : కూతుళ్ల‌కు ప‌నితీరుపై సీజేఐ వివ‌ర‌ణ‌

Leave A Reply

Your Email Id will not be published!