DGP Telangana : తనను రాష్ట్ర ప్రభుత్వం కావాలని బయటకు పంపించిందంటూ కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన కామెంట్స్ పై సీరియస్ అయ్యారు డీజీపీ మహేందర్ రెడ్డి.
వాస్తవాలు తెలుసు కోకుండా మాట్లాడితే ఎలా అని ప్రశ్నించారు. డీజీపీ పూర్తి క్లారిటీ ఇచ్చారు. ఒక ఉన్నత స్థానంలో ఉన్న వ్యక్తులపై ఆరోపణలు చేసే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించి మాట్లాడాలని హితవు పలికారు.
పదవి ఉంది కదా అని ఎలా పడితే అలా మాట్లాడటం మంచి పద్దతి కాదన్నారు. తనను రాష్ట్ర ప్రభుత్వం పంపించ లేదని, తానే అనారోగ్యం కారణంగా సెలవు పెట్టుకున్నానని చెప్పారు.
రేవంత్ రెడ్డి చేసిన ఆరోపణలు అవాస్తవమన్నారు డీఆజీపీ. అవన్నీ కట్టు కథలు, అవాస్తవాలు అంటూ మండిపడ్డారు డీజీపీ మహేందర్ రెడ్డి. ఇటీవల తాను ఇంట్లో ఉన్న సమయంలో జారి పడ్డా.
ఇంతలో నా భుజానికి తీవ్రంగా గాయమైంది. మూడు చోట్ల ఫ్యాక్చర్ అయినట్లు ఎక్స్ రే, సిటీ స్కాన్ , ఎంఆర్ఐ రిపోర్టులో కూడా తేలిందన్నారు. ఇదే సమయంలో వైద్యులు భుజానికి కట్టు కట్టారు. మూడు వారాల పాటు విశ్రాంతి తీసుకోమని సూచించారని తెలిపారు.
గత ఫిబ్రవరి 18 నుంచి ఈనెల 4 వరకు సెలవులో ఉన్నానని చెప్పారు. వైద్యులు, నిపుణులు సూచించిన సలహాల మేరకే తాను విధుల్లో చేరడం జరుగుతోందన్నారు.
ఇంట్లోనే వ్యాయామం, ఫిజియో థెరపీ, మందులను కూడా వాడుతున్నట్లు స్పష్టం చేశారు మహేందర్ రెడ్డి. అయితే వాస్తవాలు తెలుసు కోకుండా తనను సర్కార్ బలవంతంగా పంపించిందంటూ రేవత్ తప్పుడు ప్రచారం చేయడాన్ని ఖండిస్తున్నట్లు చెప్పారు డీజీపీ.