Dharmana Prasad Rao : ఏపీ సీఎం జగన్ సంచలన నిర్ణయం
లబ్దిదారులకు సర్వ హక్కులు ఉంటాయి
Dharmana Prasad Rao : ఏపీ సీఎం జగన్ రెడ్డి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయాన్ని స్వయాన ఏపీ మంత్రి ధర్మాన ప్రసాదరావు వెల్లడించారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. అసైన్డ్ భూముల విషయంలో కీలక నిర్ణయం తీసుకున్నారని, ఇది రాష్ట్రంలో జీడీపీ పెరిగేందుకు దోహద పడుతుందన్నారు మంత్రి.
భూములు కలిగిన లబ్దిదారులకే సర్వ హక్కులు ఉంటాయన్నారు. పేద రైతుల హోదాను పెంచడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. 20 ఏళ్లు నిండిన అసైన్డ్ భూములపై ఆంక్షలు ఎత్తి వేస్తున్నట్లు తెలిపారు.
ప్రైవేట్ భూమిపై ఆ యజమానికి ఉండే హక్కులన్నీ అసైన్డ్ రైతులకు వర్తిస్తాయని స్పష్టం చేశారు ధర్మాన ప్రసాదరావు(Dharmana Prasad Rao). గతంలో ఏ సీఎం ఇలాంటి నిర్ణయం తీసుకోలేదన్నారు.
స్వాతంత్రం వచ్చాక తొలి భూ సంస్కరణ ఇది అని పేర్కొన్నారు. ఎవరైతే భూములపై హక్కులు కలిగి ఉంటే వారే యజమానులు అవుతారని తెలిపారు ధర్మాన ప్రసాదరావు. 1977లో తీసుకు వచ్చిన చట్టాన్ని సమగ్రంగా అధ్యయనం చేశారని , చివరకు సుదీర్ఘ కాలం పాటు కలిగి ఉన్న భూములకు సంబంధించి సాహసోపేత నిర్ణయానికి తెర తీశారని కొనియాడారు.
ఈ నిర్ణయం వెనుక అనేక ప్రయోజనాలు కలుగుతాయని తెలిపారు. రైత్వారీ పట్టా పొందిన వారికే ఈ భూమిపై హక్కు ఉంటుందన్నారు. రాష్ట్రంలో 15.21 లక్షల మందికి లబ్ది చేకూరుతుందన్నారు.
Also Read : Rahul Gandhi : ఇస్రో సక్సెస్ రాహుల్ కంగ్రాట్స్