Revanth Reddy : దోషులు ఎవ‌రో తేల్చ‌క‌పోతే ధ‌ర్నా – రేవంత్

మునుగోడులో కాంగ్రెస్ పార్టీ ఆఫీసు ద‌గ్దం

Revanth Reddy : మునుగోడు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గానికి ఉప ఎన్నిక జ‌ర‌గ‌నుండ‌డంతో రాజ‌కీయ వేడి మ‌రింత వేడెక్కింది. ప‌లువురు బ‌రిలో ఉన్నా ప్ర‌ధానంగా పోటీ మాత్రం మూడు పార్టీల మ‌ధ్యే ఉంటోంది. కాంగ్రెస్ పార్టీ నుండి పాల్వాయి స్ర‌వంతి రెడ్డి, భార‌తీయ జ‌న‌తా పార్టీ నుండి కోమ‌టిరెడ్డి రాజ గోపాల్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర స‌మితి నుండి ప్ర‌భాక‌ర్ రెడ్డి బ‌రిలో ఉన్నారు.

కాగా ఎన్నిక‌ల ప్ర‌చారం ఊపందుకుంది. నువ్వా నేనా అన్న రీతిలో కొన‌సాగుతోంది. ఈ సంద‌ర్భంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన కార్యాల‌యాన్ని గుర్తు తెలియ‌ని వ్య‌క్తులు ద‌గ్ధం చేశారు. దీనిపై సీరియ‌స్ గా స్పందించారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy).

ఆయ‌న మునుగోడులో త‌మ పార్టీ అభ్య‌ర్థి త‌ర‌పున ప్ర‌చారం చేయాల్సి ఉంది. అంత‌కు ముందే ఈ ఘ‌ట‌న చోటు చేసుకోవ‌డం క‌ల‌క‌లం రేపింది.

మునుగోడు లోని చండూరులో పార్టీ కార్యాల‌యానికి నిప్పు పెట్ట‌డాన్ని తీవ్రంగా త‌ప్పు ప‌ట్టారు. ఇది పూర్తిగా అప్ర‌జాస్వామిక‌మ‌ని పేర్కొన్నారు. ఈరోజు వ‌ర‌కు అస‌లు దోషులు ఎవ‌రో తేల్చ‌లేద‌ని మండిప‌డ్డారు రేవంత్ రెడ్డి. తాను 24 గంట‌ల స‌మ‌యం ఇస్తున్నాన‌ని ఈ ఘ‌ట‌న‌కు పాల్ప‌డిన వారు ఎవ‌రో తేల్చాల‌ని లేక పోతే ఎస్పీ ఆఫీసు ముందు ధ‌ర్నా చేప‌డ‌తాన‌ని హెచ్చ‌రించారు టీపీసీసీ చీఫ్‌.

ప్ర‌చార సామాగ్రిని కూడా ద‌గ్ధం చేశార‌ని ఆరోపించారు. ఇలాంటి చ‌ర్య‌లు త‌మ పార్టీ అభ్య‌ర్థి గెలుపును అడ్డుకోలేవ‌ని స్ప‌ష్టం చేశారు రేవంత్ రెడ్డి. చూసీ చూడ‌న‌ట్లు వ్య‌వ‌హ‌రిస్తే చూస్తూ ఊరుకోబోమమ‌న్నారు.

Also Read : అభిషేక్ రావు స‌రే త‌ర్వాత ఎవ‌రో

Leave A Reply

Your Email Id will not be published!