#DiamondIndustry : కళ తప్పిన వజ్రాలు కార్మికులకు కష్టాలు
నీరవ్ మోడీ దెబ్బకు కార్మికులకు కన్నీళ్లు
Diamonds Industry: ప్రపంచంలో బంగారం, వెండి, వజ్రాలకు ఉన్న డిమాండ్ ఇంకే వస్తువులకు లేదు. దీంతో తళుక్కుమనే వజ్రాలు మెరవడం మానేశాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ కళ తప్పాయి. వరల్డ్ డైమండ్ మార్కెట్ లో అతిపెద్ద డైమండ్ పాలిషింగ్ హబ్ అయిన సూరత్ లో.. లక్షల మంది కార్మికులు రోడ్డున పడుతున్నారు. ఇండియన్ ఎకానమీలో ప్రధాన భూమిక పోషించే జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీ తీవ్ర ఒడిదుడులకు లోనవుతోంది. డైమండ్ మొఘల్ గా పేరున్న నీరవ్ మోడీ 14 వేల కోట్ల స్కామ్ తర్వాత ఈ ఇండస్ట్రీ పూర్తిగా పడి పోయింది. ఇక అప్పుడు మొదలైన పతనం, స్లోడౌన్ ఎఫెక్ట్‌తో మరింత కుదేలైంది.
ఇండియాకు దిగుమతి అవుతోన్న ముడి సరుకు వజ్రాలు 22 శాతం వరకు తగ్గి పోయాయి. పాలిష్డ్ డైమండ్ ఎగుమతులు 18 శాతం వరకు తగ్గినట్టు జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఎక్స్‌పోర్ట్ ప్రమోషన్ కౌన్సిల్ డేటా పేర్కొంది. సూరత్‌లో జెమ్స్ ఇండస్ట్రీలో పనిచేస్తోన్న ఉద్యోగులు తగ్గి పోయారు. ప్రతిభా వంతులైన కళాకారులకూ ఆదాయాలు 70 శాతానికి పైగా తగ్గిపోయినట్టు లోకల్ ఇండస్ట్రీ ఛాంబర్స్ ప్రకటించాయి. జెమ్స్ అండ్ జ్యూయల్లరీ ఇండస్ట్రీలో 50 లక్షల మంది వర్కర్ లు పని చేస్తున్నారు. ఇండియా జీడీపీలో 7 శాతం ఈ రంగానిదే.
15 శాతం ఎగుమతులు జెమ్స్ అండ్ జ్యూయల్లరీకి చెందినవే ఉంటున్నాయి. ప్రస్తుత స్లోడౌన్ ఎఫెక్ట్‌తో కార్ల తయారీదారుల నుంచి రిటైలర్ల వరకు ఎవరికీ ఫండ్స్ దొరకడం లేదు. జెమ్స్ అండ్ జ్యూ యల్లరీ పరిస్థితి అయితే మరీ ఘోరం. నీరవ్ మోడీ పీఎన్‌బీని 14 వేల కోట్లకు ముంచి, విదేశాలకు చెక్కేసిన తర్వాత, చాలా బ్యాంక్‌లు జ్యూయల్లర్స్‌కు డబ్బులు ఇవ్వడం మానేశాయి. డైమండ్ ఇండస్ట్రీకి(Diamonds Industry) తాము రుణాలివ్వమని చాలా బ్యాంక్‌లు కూడా తేల్చి చెబుతున్నాయి.
గనుల నుంచి వెలికి తీసిన ప్రతి 15 ముడి వజ్రాల్లో 14 వజ్రాలకు సూరత్ పరిశ్రమే సాన పెడుతోంది. వరల్డ్ లోనే అతి పెద్ద వజ్రాల (Diamonds Industry)తయారీ కంపెనీ దక్షిణాఫ్రికాకు చెందిన డీబీర్స్ తో పాటు అల్రోసా పీజేఎస్‌సీ లాంటివి కూడా ఇక్కడే సాన పెడుతున్నాయి. సూరత్ జెమ్స్ అండ్ జ్యూయల్లరీకే కాక, టెక్స్‌టైల్, రియల్ ఎస్టేట్ రంగాలకు పేరుంది. ఈ ఒక్క సూరత్ లోనే జెమ్స్ అండ్ జ్యూయల్లరీ రంగంలో15 లక్షల మంది పని చేస్తున్నారు. ఇప్పుడు మోడీ దెబ్బకు వజ్రాల మాటేమిటో కానీ కార్మికులు మాత్రం పస్తులుంటున్నారు.
No comment allowed please