Mamata Banerjee : బీజేపీ విజ‌యం దీదీ అనుమానం

అఖిలేష్ యాద‌వ్ నిరాశ చెంద‌కు

Mamata Banerjee : ప‌శ్చిమ బెంగాల్ సీఎం, తృణ‌మూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ మ‌మ‌తా బెన‌ర్జీ సంచ‌ల‌న కామెంట్స్ చేశారు. ఆమె మ‌రోసారి భార‌తీయ జ‌న‌తా పార్టీ తీరుపై నిప్పులు చెరిగారు. దేశంలోని ఐదు రాష్ట్రాల‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ఫ‌లితాల‌పై ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు.

ఉత్త‌ర ప్ర‌దేశ్, ఉత్త‌రాఖండ్, మ‌ణిపూర్ , గోవాల‌లో బీజేపీ గెలుపొందిన విధానం, ఆ పార్టీకి చెందిన అభ్య‌ర్థులు సాధించిన విజ‌యం ప‌ట్ల త‌న‌కు అనుమానం ఉంద‌న్నారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు.

ఈవీఎంల‌పై ఫోరెన్సిక్ ప‌రీక్ష‌లు చేయించాల‌ని మ‌మ‌తా బెన‌ర్జీ (Mamata Banerjee)డిమాండ్ చేశారు. గ‌తంలో కంటే ఈసారి యూపీలో స‌మాజ్ వాది పార్టీ కూట‌మి గ‌ట్టి పోటీ ఇచ్చింద‌న్నారు. అఖిలేష్ యాద‌వ్ నిరాశ ప‌డ‌కూడ‌ద‌న్నారు.

ఆ పార్టీని ఓడిపోయేలా మోదీ చేశారంటూ సంచ‌ల‌న ఆరోప‌ణ‌లు చేశారు. ఇదిలా ఉండ‌గా 2024లో భార‌తీయ జ‌న‌తా పార్టీని ఓడించేందుకు తాము కాంగ్రెస్ పార్టీపై ఆధార‌ప‌డే ప్ర‌స‌క్తి లేదంటూ కుండ బ‌ద్ద‌లు కొట్టారు.

ఇది ప్ర‌జ‌లు అందించిన తీర్పు కాద‌న్నారు. ఎన్నిక‌ల యంత్రాంగం, సాంకేతిక స‌హాయంతో సాధించిన గెలుపుగా అభివ‌ర్ణించారు దీదీ. కాంగ్రెస్ పార్టీపై ఆమె సెటైర్లు వేశారు. కూర్చొని లెక్కలు వేసుకుంటే ఫ‌లితాలు రావ‌న్నారు.

ఒక ర‌కంగా ఈ ఎన్నిక‌ల ఫ‌లితాలు మోదీ త్ర‌యానికి పెద్ద బూస్ట్ గా ఆమె పేర్కొన్నారు. ప్ర‌జ‌లు ఓటు వేసేందుకు ఉప‌యోగించే యంత్రాల గురించి అనుమానం క‌లుగుతోంద‌న్నారు.

పూర్తిగా ప్ర‌జా వ్య‌తిరేక పాల‌న సాగిస్తున్న బీజేపీకి అన్ని సీట్లు ఎలా వ‌స్తాయో అర్థం కావ‌డం లేద‌న్నారు మ‌మ‌తా బెన‌ర్జీ.

Also Read : కాంగ్రెస్ పార్టీపై కెప్టెన్ క‌న్నెర్ర‌

Leave A Reply

Your Email Id will not be published!