Locket Chatterjee : దీదీ క్షమాపణ చెప్పాల్సిందే – లాకెట్ ఛటర్జీ
రాష్ట్రపతిపై మంత్రి కామెంట్స్ పై ఫిర్యాదు
Locket Chatterjee : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ (టీఎంసీ) కు చెందిన మంత్రి అఖిల గిరి భారత దేశ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై సంచలన కామెంట్స్ చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలు కలకలం రేపాయి. ఈ తరుణంలో మంత్రిపై భారతీయ జనతా పార్టీకి చెందిన ఎంపీ లాకెట్ ఛటర్జీ(Locket Chatterjee) ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆదివారం ఆమె మంత్రిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడారు. మంత్రి నిర్వాకం, చేసిన కామెంట్స్ కు బేషరతుగా పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ(Mamatha Banerjee) క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆమె సపోర్ట లేకుండా మంత్రి రాష్ట్రపతిపై ఎలా కామెంట్స్ చేస్తారంటూ ప్రశ్నించారు.
ఇదిలా ఉండగా లాకెట్ ఛటర్జీ పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ పార్లమెంట్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఢిల్లీలోని నార్త్ అవెన్యూ పోలీస్ స్టేషన్ లో మంత్రి అఖిల గిరిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఫిర్యాదు చేశారు ఎంపీ. షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ క్యాస్ట్ కింద ప్రథమ సమాచార నివేదిక (ఎఫ్ఐఆర్) దాఖలు చేశారు.
వెంటనే మంత్రిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. కింది స్థాయి నుంచి కష్టపడి ఉన్నత స్థాయికి ఎదిగిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ముపై అనాలోచిత వ్యాఖ్యలు చేయడం మంచి పద్దతి కాదన్నారు ఎంపీ లాకెట్ ఛటర్జీ(Locket Chatterjee).
లాకెట్ ఛటర్జీ ఇవాళ మీడియాతో మాట్లాడారు. అనుచిత వ్యాఖ్యలు చేసిన మంత్రి అఖిల గిరిని వెంటనే కేబినెట్ నుంచి తొలగించాలని ఆమె డిమాండ్ చేశారు. ఆమె ఢిల్లీకి వచ్చి క్షమాపణ చేయాలని కోరారు.
Also Read : 117 మందితో ఆప్ రెండో లిస్టు రిలీజ్