BJP Clean Sweeps : సహకార ఎన్నికల్లో దీదీకి ఎదురు దెబ్బ
నందిగ్రామ్ లో బీజేపీ అభ్యర్థుల హవా
BJP Clean Sweeps : తృణమూల్ కాంగ్రెస్ పార్టీ చీఫ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి కోలుకోలేని షాక్ తగిలింది. ఇప్పటికే కేంద్ర దర్యాప్తు సంస్థల వరుస దాడులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న సమయంలో నందిగ్రామ్ లో ఎదురు దెబ్బ తగిలింది.
కీలక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్(BJP Clean Sweeps) చేసింది. గతంలో మమతా బెనర్జీ నేతృత్వంలోని టీఎంసీ ఆధ్వర్యంలో నడిచే సహకార సంస్థ భేకుటియా సమబే కృషి సమితికి చెందిన 12 సీట్లలో 11 స్థానాలను బీజేపీ అభ్యర్థులు కైవసం చేసుకున్నారు.
కేవలం ఒకే ఒక్క సీటుతో సరి పెట్టుకుంది టీఎంసీ. 2021 ఎన్నికల్లో మమతా బెనర్జీని ఓడించింది ఈ నియోజకవర్గమే. ఇదే నియోజకవర్గంలో సహకార సంస్థకు ఎన్నికలు జరిగాయి.
వీటిని ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి ఇరు పార్టీలు బీజేపీ, టీఎంసీ. ప్రస్తుతం అధికారంలో టీఎంసీ ఉంది. ఆదివారం ఈ ఎన్నికల ఫలితాలను ప్రకటించారు.
కేవలం ఒకే ఒక్క సీటుకే పరిమితం కావడంతో టీఎంసీ శిబిరంలో నిరాశ నెలకొంది. పార్టీ శ్రేణులకు ఇది కోలుకోలేని షాక్. ఇదిలా ఉండగా గత నెల నందిగ్రామ్ లోని మరో ప్రాంతంలో టీఎంసీ బిగ్ విక్టరీ సాధించింది.
నందిగ్రామ్ -2 బ్లాక్ లో టీఎంసీ 51 సీట్లు గెలుచుకుంది. సీపీఎం ఒకటి, బీజేపీ ఒక సీటుతో సరి పెట్టుకున్నాయి. ఇక టీఎంసీ కొంటాయ్ , సింగూరు ఎన్నికల్లో కూడా క్లీన్ స్వీప్ చేసింది.
ఇదిలా ఉండగా జరిగిన సహకార ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ హింసకు పాల్పడ్డాయని ఇరు పార్టీలు ఆరోపణలు చేసుకున్నాయి. ప్రస్తుతం టీఎంసీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన సువేందు అధికారి నందిగ్రామ్ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
Also Read : బీజేపీలో చేరాలనుకునే వారిని అడ్డుకోం