KTR : కేటీఆర్ కు డిజిటల్ బ్రిడ్జ్ ఫోరమ్ ఆహ్వానం
కజకిస్తాన్ లో ఈ ఏడాది జరగనున్న ఫోరమ్
KTR : కజకిస్తాన్ లో ఈ ఏడాది 2022 బిగ్ డిజిటల్ బ్రిడ్జ్ ఫోరమ్ జరగనుంది. ఈ మేరకు ఈ ఫోరమ్ కు రావాల్సిందిగా తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(KTR) కు ఆహ్వానం అందింది.
సెప్టెంబర్ 28 నుండి 29 వరకు కజకిస్తాన్ లోని నూర్ – సుల్తాన్ లో జరగనున్న 2022 డిజిటల్ బ్రిడ్జ్ ఫోరమ్ కు గౌరవ అతిథిగా తెలంగాణ మంత్రిని ఆహ్వానించారు.
రిపబ్లిక్ ఆఫ్ కజకిస్తాన్ కు సంబంధించిన డిజిటల్ డెవలప్ మెంట్ , ఇన్నోవేషన్స్ , ఏరో స్పేస్ పరిశ్రమల మంత్రి బగ్దత్ ముస్సిన్ కజకిస్తాన్ ప్రభుత్వం తరపున ఇన్విటేషన్ ను కేటీఆర్(KTR) కు అందించారు.
ఇదిలా ఉండగా ఈ డిజిటల్ ఫోరమ్ ను ప్రభుత్వమే నిర్వహిస్తుంది. సెంట్రల్ ఏషియా వేదికగా ఐటీ, ఇన్నోవేషన్స్ లో పోకడలు, సవాళ్లు , పురోగతిని అన్వేషించనున్నారు.
మధ్య ఆసియా , ప్రపంచ వ్యాప్తంగా ఆర్థిక, సాంకేతిక సహకారంపై ఈ డిజిటల్ ఫోరమ్ లో చర్చించనున్నారు. ఫోరమ్ బిగ్ డేటా , క్లౌడ్ సొల్యూషన్ లతో సహా తాజా సాంకేతిక పురోగతులు, ఆవిష్కరణలపై ఫోకస్ పెడుతుంది .
అంతే కాకుండా పబ్లిక్ సర్వీసెస్ డిజిటల్ ట్రాన్స్ ఫార్మేషన్ , డిజిటల్ ఇన్ ఫ్రా స్ట్రక్చర్ (మౌలిక వసతుల కల్పన)లో పెట్టుబడులు పెడుతుంది.
కాగా ప్రస్తుతం దేశంలోనే ఐటీ సెక్టార్ పరంగా టాప్ లో కొనసాగుతోంది హైదరాబాద్. ప్రపంచ వ్యాప్తంగా పేరొందిన ఐటీ, ఫార్మా, లాజిస్టిక్ తదితర రంగాలకు చెందిన కంపెనీలన్నీ భాగ్యనగరాన్ని ఎంచుకుంటున్నాయి.
ఇప్పటికే కేపిటల్ సిటీ గ్లోబల్ హబ్ గా మారింది. తనను ప్రత్యేక అతిథిగా ఆహ్వానించినందుకు కజకిస్తాన్ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు మంత్రి కేటీఆర్.
Also Read : ఒక్క రోజే 4 వేలకు పైగా కరోనా కేసులు