Digvijaya Singh: రామ్ దేవ్ బాబా పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫిర్యాదు
రామ్ దేవ్ బాబా పై కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ ఫిర్యాదు
Digvijaya Singh : ప్రముఖ యోగా గురు రామ్‌దేవ్ బాబా ‘షరబత్ జిహాద్’ వ్యాఖ్యలు వివాదంలో చిక్కుకున్నాయి. ఆయన తన వ్యాఖ్యల ద్వారా మతపరమైన విద్వేషాలను వ్యాప్తి చేస్తున్నారంటూ కాంగ్రెస్ సీనియర్ నేత, మధ్యప్రదేశ్ రాజ్యసభ సభ్యుడు దిగ్విజయ్ సింగ్(Digvijaya Singh) భోపాల్‌లోని టీటీ నగర్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. బిఎన్ఎస్ లోని 196(1), 299 సెక్షన్లు, ఇన్‌ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాల్సిందిగా కోరారు. ఆయన ఫిర్యాదుపై విచారణ జరుపుతామని పోలీసులు తెలిపారు.
Digvijaya Singh File Case Against Ramdev Baba
మతం, కులం, భాష, ప్రాంతం ఆధారంగా గ్రూపుల మధ్య శత్రుత్వాన్ని ప్రమోట్ చేయడాన్ని సెక్షన్ 196 నిరోధిస్తుంది. ప్రజల మతపరమైన భావోద్వేగాలను ఉద్దేశపూర్వకంగా కించపరచడాన్ని సెక్షన్ 299 అడ్డుకుంటుంది. రామ్‌దేవ్ బాబా సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా విడుదల చేసిన వీడియోలో పతంజలి ఆయుర్వేద ఉత్పత్తుల అమ్మకాలను పెంచుకునేందుకు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టారని దిగ్విజయ్ ఆరోపించారు.
రామ్‌దేవ్ తమ పతంజలి గులాబ్ షరబత్ మార్కెటింగ్ చేస్తూ, మద్రసాలు, మసీదుల నిర్మాణం కోసం ఒక కంపెనీ తమ ఉత్పత్తులు అమ్ముకుంటోందని పేర్కొన్నారని… ఆయన ‘హందర్ద్ కంపెనీ’ గురించి మాట్లాడారనే విషయం దేశ ప్రజలందరికీ తెలిసిందేనని దిగ్విజయ్ అన్నారు. ‘రూహ్ అఫ్జా’ షరబత్ యజమాని ఒక ముస్లిం కావడంతోనే రామ్‌దేవ్ ఈ విద్వేష ప్రసంగం చేశారని, ‘షరబత్ జిహాద్’గా దానిని పేర్కొన్నారని, ఇది రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. రామ్ దేవ్ బాబా నేరంపై ప్రస్తుతం అమల్లో ఉన్న చట్టాల కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆయన కోరారు. దీనిపై అదనపు పోలీస్ కమిషన్ మాట్లాడుతూ, రామ్‌దేవ్ బాబా మతపరమైన భావాలను దెబ్బతీసినందున ఎఫ్ఐఆర్ నమోదు చేయాలంటూ దిగ్విజయ్ ఫిర్యాదు చేసినట్టు చెప్పారు. దీనిపై దర్యాప్తు జరిపి తదనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.
Also Read : AP Government: 2,260 పోస్టులతో స్పెషల్ డిఎస్సీకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్