Digvijaya Singh : కాంగ్రెస్ లో లొల్లి దిగ్విజయ్ కు తలనొప్పి
సీనియర్లు గరం రేవంత్ రెడ్డి నిర్వాకం
Digvijaya Singh : సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలో ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించగలరన్న పేరుంది ఆ పార్టీ జనరల్ సెక్రటరీ దిగ్విజయ్ సింగ్ కు(Digvijaya Singh) . ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో తీవ్ర అంసతృప్తి నెలకొంది. పార్టీకి చెందిన సీనియర్లు ధిక్కార స్వరం వినిపించారు.
ఏకంగా తొమ్మిది మంది సీనియర్లు తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ చీఫ్ ఎనుముల రేవంత్ రెడ్డిపై నిప్పులు చెరిగారు. ఆయన వల్లనే పార్టీకి తీరని నష్టం వాటిల్లుతోందంటూ ఆరోపించారు. ఈ మేరకు ఆధారాలతో సహా బయట పెట్టారు. ఈ సందర్భంగా వారు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలను ఉదహరించారు.
హుజూరాబాద్ లో 1.5 శాతానికి ఓటింగ్ పడి పోయిందని, ఇక మునుగోడులో 49 శాతం ఉన్న ఓటు బ్యాంకు ప్రస్తుతం 10 శాతానికి దిగజారడం వెనుక రేవంత్ రెడ్డే కారణమంటూ ఆరోపించారు. రంగంలోకి దిగిన డిగ్గీ రాజా(Digvijaya Singh) హైదరాబాద్ లో మకాం వేశారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నం చేస్తున్నారు.
ఈ మేరకు ప్రతి ఒక్కరితో కనీసం 15 నిమిషాలు టైం ఇస్తున్నారు. వారి నుంచి ఫిర్యాదులు స్వీకరిస్తున్నారు. ప్రధానంగా సీనియర్లు రేవంత్ రెడ్డిని టార్గెట్ చేయడం డిగ్గీ రాజాకు తలనొప్పిగా మారింది. తమను పార్టీకి ద్రోహం చేస్తున్నట్లు ప్రచారం చేయిస్తున్నాడని ఆరోపించారు. అంతే కాకుండా తనకు చెందిన వారితో కోవర్టులుగా ముద్ర వేస్తూ కుట్రలు పన్నాడంటూ మండిపడ్డారు.
ఈ ఆరోపణలు చేసిన వారిలో సీనియర్లు ఉండడం విశేషం. మొత్తంగా దిగ్విజయ్ సింగ్ అనుభవానికి పరీక్షగా మారింది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో చోటు చేసుకున్న అసమ్మతి వ్యవహారం.
Also Read : రేవంత్ నిర్వాకం పార్టీకి నష్టం