Digvijaya Singh TSPCC : డిగ్గీ రాజాకు ఫిర్యాదుల వెల్లువ‌

అంతా రేవంత్ రెడ్డి పైనే గ‌రం

Digvijaya Singh TSPCC : తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జ‌రుగుతుందో ఎవ‌రికీ అర్థం కావ‌డం లేదు. పోనీ ఆ పార్టీకి కూడా అంతుప‌ట్ట‌డం లేదు. రోజు రోజుకు పార్టీ ప్ర‌తిప‌క్ష పాత్ర పోషించాల్సిన స‌మ‌యంలో త‌నంత‌కు తాను డిఫెన్స్ లో ప‌డి పోయింది. ఒక‌రిపై మ‌రొక‌రు ఆరోప‌ణ‌లు చేసుకుంటూ ర‌క్తి క‌ట్టిస్తున్నారు.

ఓ వైపు ఎన్నిక‌లు త్వ‌ర‌లో జ‌ర‌గ‌నున్నాయి. ఇప్ప‌టికే అధికారంలో ఉన్న భార‌త రాష్ట్ర స‌మితి ముంద‌స్తు ప్రణాళిక‌ల్లో మునిగి పోయింది. ఇక భార‌తీయ జ‌న‌తా పార్టీ ఊహించ‌ని రీతిలో నువ్వా నేనా అన్న రీతిలో దూసుకు వ‌స్తోంది. ఇక ప్ర‌స్తుతం రాష్ట్రంలో అధికార పార్టీపై తీవ్ర వ్య‌తిరేక‌త ఎదుర‌వుతోంది.

దీనిని త‌మ వైపు తిప్పుకునేందుకు ఆస్కారం ఉన్నా కాంగ్రెస్ పార్టీ చేజేతులారా పోగొట్టుకుంటోంద‌న్న ఆవేద‌న వ్య‌క్తం అవుతోంది. ప్ర‌స్తుతం తెలంగాణ కాంగ్రెస్ పార్టీ రెండుగా చీలి పోయింది. ఒకటి టీడీపీ కాంగ్రెస్ రెండు ఇందిరా కాంగ్రెస్ . ఒక వ‌ర్గం రేవంత్ రెడ్డిదే మ‌రో వ‌ర్గం సీనియ‌ర్ కాంగ్రెస్ పార్టీ వ‌ర్గంగా చీలి పోయింది.

ఈ త‌రుణంలో సీనియ‌ర్లు తీవ్ర ఆరోప‌ణ‌లు చేశారు రేవంత్ రెడ్డిపై. ఆయ‌న ఒంటెత్తు పోక‌డ వ‌ల్లే పార్టీకి తీర‌ని న‌ష్టం జ‌రుగుతోందంటూ ఆరోపించారు. దీంతో హైక‌మాండ్ రంగంలోకి దిగింది. ఈ మేర‌కు ప‌రిస్థితిన చ‌క్కిదిద్దే ప‌నిని పార్టీ జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీ దిగ్విజ‌య్ సింగ్ కు అప్ప‌గించింది.

ఆయ‌న పార్టీని గాడిలో పెట్టేందుకు, అసంతృప్తిని త‌గ్గించేందుకు ప్ర‌య‌త్నాలు ప్రారంభించారు. కానీ ఎక్క‌డా ఎవ‌రూ తగ్గ‌డం లేదు. సీనియ‌ర్లు పెద్ద ఎత్తున రేవంత్ రెడ్డిని టార్గెట్ చేస్తూ ఫిర్యాదులు గుప్పించారు. దీంతో ఊపిరి పీల్చుకునేందుకు సైతం ఇబ్బంది ప‌డ్డారు డిగ్గీ రాజా(Digvijaya Singh).

Also Read : హ‌ర్ట్’ అయిన రాజీనామా చేసిన – సీత‌క్క

Leave A Reply

Your Email Id will not be published!