Dil Raju : అభిమానుల ఆరాధ్య దైవం ‘త‌ల‌ప‌తి’

ప్ర‌శంసంచిన నిర్మాత దిల్ రాజు

Dil Raju  : టాలీవుడ్ అగ్ర‌శ్రేణి నిర్మాత దిల్ రాజు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. సౌత్ ఇండియ‌న్ స్టార్ హీరోగా పేరొందిన ఇళ‌య త‌ల‌ప‌తి విజ‌య్ ను ఆకాశానికి ఎత్తేశాడు. ఆయ‌న స్టార్ హీరో అయిన‌ప్ప‌టికీ ఎప్పుడూ అలా ఫీల్ కార‌ర‌ని పేర్కొన్నారు.

ఒక‌ర‌కంగా కామ‌న్ మ్యాన్ గా ఆలోచిస్తార‌ని, అందుకు త‌గ్గ‌ట్టు సినిమాలు ఎంచుకుంటార‌ని చెప్పారు. ప్ర‌స్తుతం దిల్ రాజు(Dil Raju )త‌ల‌ప‌తి విజ‌య్ తో సినిమా చేస్తున్నాడు.

ఇందులో నేష‌న‌ల్ క్ర‌ష్మిక ర‌ష్మిక మంద‌న్నా హీరోయిన్ కూడా. ఇప్ప‌టికే ప్రారంభోత్స‌వం కూడా పూర్త‌యింది. ఇదిలా ఉండ‌గా త‌మిళ ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో త‌ల‌ప‌తి విజ‌య్ తో పాటు పూజా హెగ్డే న‌టించిన బీస్ట్ మూవీ ఈనెల 13న రిలీజ్ కాబోతోంది.

ఇందుకు సంబంధించి మూవీ ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మం హైద‌రాబాలో జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మానికి ద‌ర్శ‌కుడు నెల్స‌న్ దిలీప్ కుమార్ , విజ‌య్, పూజా హెగ్డే, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అనిరుధ్ ర‌విచంద్ర‌న్ హాజ‌ర‌య్యారు.

ఈ సంద‌ర్భంగా దిల్ రాజు (Dil Raju ) విజ‌య్ ను ఉద్దేశించి కీల‌క వ్యాఖ్య‌లు చేశారు. ఆయ‌న ప్రేక్ష‌కుల‌కు ఏం కోరుకుంటారో దానిని ఆలోచించి క‌థ‌ల్ని ఎంచుకుంటార‌ని చెప్పారు.

అందుకే ఎన్నేళ్ల‌యినా ఇంకా స్టార్ హీరోగా కొన‌సాగుతూనే ఉన్నార‌ని పేర్కొన్నారు. ఇదిలా ఉండ‌గా స‌న్ ఇంట‌ర్నేష‌న‌ల్ చీఫ్ క‌ళానిధి మార‌న్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌న్ పిక్చ‌ర్స్ నిర్మించింది బీస్ట్ చిత్రాన్ని.

ఇదిలా ఉండ‌గా బీస్ట్ మూవీని శ్రీ వెంక‌టేశ్వ‌ర ఫిల్మ్ పై దిల్ రాజు తెలుగులో విడ‌దుల చేస్తున్నారు. నెల్స‌న్ దిలీప్ కుమార్ ను కూడా పొగిడాడు దిల్ రాజు.

Also Read : ది వారియర్ కోసం శింబు సాంగ్

Leave A Reply

Your Email Id will not be published!