Jogi Movie Trailer : దిల్జిత్ దోసాంజ్ ‘జోగి’ ట్రైల‌ర్ సూప‌ర్

1984 అల్ల‌ర్ల నేప‌థ్యంలో తెర‌కెక్కిన మూవీ

Jogi Movie Trailer : ఈ దేశంలో చోటు చేసుకున్న అల్ల‌ర‌కు ప్ర‌తీకంగా నిలిచింది 1984 సంవ‌త్స‌రం. దేశ వ్యాప్తంగా సిక్కుల‌ను దేశ ద్రోహులుగా చూసే స‌న్నివేశం.

ఆనాటి దారుణ‌మైన ట్రీట్ మెంట్ ను క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపించే ప్ర‌య‌త్నం చేశారు ద‌ర్శ‌కుడు అలీ అబ్బాస్ జాఫ‌ర్. ప్ర‌ముఖ సింగ‌ర్ దిల్జిత్ దోసాంజ్ ఢిల్లీలో చోటు చేసుకున్న అల్ల‌ర్ల మ‌ధ్య త‌న ప్ర‌జ‌లను సుర‌క్షితంగా న‌డిపించే ప‌నిలో ఉన్న సిక్కు వ్య‌క్తిగా న‌టించాడు.

ఈ చిత్రంలో మ‌హ‌మ్మ‌ద్ జీష‌న్ అయ్యూబ్ , కుముద్ మిశ్రా, హితేన్ తేజ్వినితో పాటు టైటిల్ రోల్ లో దిల్జిత్ దోసాంజ్ న‌టించారు. జోగి ట్రైల‌ర్ జోగికి సంబంధించిన భ‌యానక ప్ర‌యాణాన్ని చూపుతుంది.

అత‌ను త‌న కుటుంబ స‌భ్యుల‌ను, స్నేహితుల‌ను ఢిల్లీ నుండి , అల్ల‌ర్ల నుండి దూరంగా ఎలా తీసుకు వెళ‌తాడ‌నే దానిపై చిత్రీక‌రించాడు ద‌ర్శ‌కుడు.

1984లో ఢిల్లీలో త‌న కుటుంబంతో క‌లిసి అల్ప‌హారాన్ని తింటున్న దిల్జిత్ జోగి మాంటేజ్ తో ట్రైల‌ర్(Jogi Movie Trailer) ప్రారంభం అవుతుంది. ఈ దృశ్యాలు ఇంట్లో, కాలేజీలో జోగి సంతోష‌క‌ర‌మైన‌, నిర్ల‌క్ష్య జీవితాన్ని వ‌ర్ణిస్తాయి.

ఒక లాంగ్ షాట్ మూడు తుపాకీ షాట్ల శ‌బ్దంతో షాట్ ప్రారరంభం అవుతుంది. ఇది ప్ర‌ధాని ఇందిరా గాంధీ హ‌త్య‌ను సూచిస్తుంది. ట్రైల‌ర్ లో వాహ‌నాలు త‌గుల బెట్ట‌డం, అల్ల‌ర్లు చోటు చేసుకోవ‌డం, జోగి, స్నేహితుడిని బ‌స్సులోని వ్య‌క్తులు స‌ర్దార్ ల‌ను వేధించ‌డాన్ని సూచిస్తుంది.

త‌న జ‌ట్టును చిన్నగా క‌త్తిరించు కోవ‌డం, ఓ భావోద్వేగ క్ష‌ణంలో కుటుంబం అత‌డితో క‌లుస్తుంది. ఇదిలా ఉండ‌గా దిల్జిత్ దోసాంజ్ మోస్ట్ పాపుల‌ర్ సింగ‌ర్ గా పేరొందారు.

Also Read : ఫ్యామిలీతో కింగ్ నాగ్ బ‌ర్త్ డే వేడుక‌లు

Leave A Reply

Your Email Id will not be published!